27 నగరాల్లో 1000 కిమీ పైగా మెట్రో నెట్‌వర్క్ పనులు   

దేశవ్యాప్తంగా 27 నగరాల్లో 1000 కిలోమీటర్లకు పైగా మెట్రో నెట్‌వర్క్ పనులు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్-2, సూరత్ మెట్రో రైల్ ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూమి పూజ జరుపుతూ ఒకప్పుడు దేశంలో మెట్రో నెటవర్క్ గురించి ఆధునిక ఆలోచన ఉండెడిది కాదని చెప్పారు. దానితో మెట్రో విధానమనేదే లేకుండా పోయినదని విచారం వ్యక్తం చేశారు. 
 
ఫలితంగా వివిధ నగరాల్లో వివిధ రకాల మెట్రోలు ఉండేవని పేర్కొన్నారు. తాము నగరాల్లోని రవాణా వ్యవస్థను అభివృద్ధి చేశామని, ఇంటిగ్రేటెడ్ వ్యవస్థను తెచ్చామని చెప్పారు. బస్సు, మెట్రో, రైల్ వ్యవస్థను కలెక్టివ్ సిస్టంగా అభివృద్ధి చేస్తున్నామని మోదీ తెలిపారు. 
 
దేశవ్యాప్తంగా మెట్రో రైల్ నెట్‌వర్క్ విస్తరణ పరంగా గత ప్రభుత్వాలకు, ప్రస్తుత ప్రభుత్వ పనితీరుకు తేడా ఏమిటో స్పష్టంగా అవగతం చేసుకోవచ్చని ప్రధాని సూచించారు.  2014కు ముందు 10-12 ఏళ్ల వ్యవధిలో కేవలం 225 కిలోమీటర్ల మెట్రో లైను అందుబాటులోకి వస్తే గత ఆరేళ్లలో 450 కిలోమీటర్లకు పైగా మెట్రో నెట్‌వర్క్ కార్యరూపంలోకి వచ్చిందని చెప్పారు.
 
గుజరాత్‌లో రెండు ప్రముఖ పట్టణ కేంద్రాలకు ఈరోజు చారిత్రకమైన రోజని చెబుతూ మెట్రో ప్రాజెక్టులతో ఈ రెండు నగరాలకు పర్యావరణ హితకర ‘మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం’ అందుబాటులోకి వస్తుందని ప్రధాని తెలిపారు.  అహ్మదాబాద్, సూరత్‌లు ఈరోజు రెండు బహుమతులు అందుకున్నాయని చెప్పారు. 
 
దేశంలోని ప్రధాన వాణిజ్య కేంద్రాలైన ఈ రెండు నగరాల మధ్య మెట్రో ప్రాజెక్టుతో వాణిజ్య అనుసంధానం మరింత పటిష్టమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, కేంద్ర హౌసింగ్, అర్బన్ వ్యవహారాల మంత్రి హ ర్దీప్ సింగ్ పురి ఈ సందర్భంగా పాల్గొన్నారు.