చైనాలో ఐస్ క్రీంకు కూడా కరోనా పాజిటివ్ 

గత ఏడాది కాలంగా చైనా నుండి మనుషులకు మాత్రమే  కరోనా మహమ్మారి వ్యాపిస్తూ  ప్రపంచాన్ని కకాలవికాలం కావిస్తున్నది. అయితే తాజాగా ఆ దేశంలో ఐస్ క్రీంలకు కూడా  కరోనా వ్యాపిస్తున్నట్లు వెల్లడైనది. కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలిన ఐస్‌ క్రీం ప్యాకెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అంటూ వాటి జాడ కోసం చైనా అధికారులు హైరానా పడుతూ వెతుకుతున్నారు. 

ఈ వింత ఘటన చైనాలోని ఉత్తర టియాంజిన్‌ మున్సిపాలిటీలోని టియాంజిన్‌ డాకియోడావు ఫుడ్‌ కంపెనీలో సంభవించింది. ఇక్కడ తయారైన ఐస్ క్రీం మూడు నమూనాలను కొవిడ్‌-19 కు పాజిటివ్ పరీక్షించాయి. ఐస్‌క్రీమ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులను ఆరోగ్య అధికారులు గుర్తించి ఊపిరిపీల్చుకున్నారు.

ఉత్తర టియాంజిన్ మునిసిపాలిటీ పరిధిలోని టియాంజిన్ డాకియోడావో ఫుడ్ కంపెనీ తయారు చేసిన ఐస్‌క్రీంలో కరోనా పాజిటివ్‌ నివేదికలు వచ్చాయి. కంపెనీ మొత్తం 4,836 బాక్సులను ఉత్పత్తి చేయగా  వాటిలో 1,812 వివిధ ప్రావిన్సులకు రవాణా అయ్యాయి. 2,089 బాక్సులను సీలు చేసి భద్రపరిచినట్లు చైనా డైలీ తన కథనంలో పేర్కొన్నది. 

కొవిడ్‌-19 కు మూడు నమూనాలు పాజిటివ్ పరీక్షించిన తరువాత స్థానిక మార్కెట్లో విక్రయించిన 65 బాక్సులపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఐస్ క్రీములు కొన్న వారి ఆరోగ్యం, శారీరక కదలికలను నివేదించమని కోరారు. సంస్థలో పనిచేస్తున్న మొత్తం 1,662 మంది ఉద్యోగులను నిర్బంధంలో ఉంచారు. వీరిలో 700 మంది వైరల్ ఇన్‌ఫెక్షన్‌కు పాటిజివ్‌గా తేలారు.

టియాంజిన్‌ డాకియోడావో ఫుడ్‌ కంపెనీ తయారుచేసే ప్రతి పెట్టెలో ఆరు ఐస్ క్రీం ఉత్పత్తులు ఉన్నాయి. వీటిని ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకున్న పాల పొడి, న్యూజిలాండ్ నుంచి వచ్చిన పాలవిరుగుడు పొడి ఉపయోగించి తయారు చేశారు. అయితే ఇది “భయాందోళనలకు” కారణం కాదని లీడ్స్ విశ్వవిద్యాలయానికి చెందిన వైరాలజిస్ట్ డాక్టర్ స్టీఫెన్ గ్రిఫిన్ తెలిపారు.

 “ఇది ఒక వ్యక్తి నుంచి వచ్చి ఉండవచ్చు వివరాలు తెలియకుండా ఇది బహుశా ఒక్కసారిగా ఉంటుందని భావిస్తున్నాను” అని ఆయన చెప్పారు. ఐస్‌క్రీమ్‌ను నిల్వ చేసిన ఉష్ణోగ్రత, పరీక్షించిన నమూనాలలో వైరస్ ఎందుకు బయటపడిందో అందులో ఉన్న కొవ్వు వివరించగలదని వైరాలజిస్ట్ పేర్కొన్నారు. అయినప్పటికీ, “ప్రతి బిట్ ఐస్ క్రీం అకస్మాత్తుగా కరోనా వైరస్‌తో కలుషితమవుతుందని భయపడాల్సిన అవసరం లేదు” అని ఆయన సూచించారు.