ఆంధ్ర ప్రదేశ్ లో వరుసగా దేవాలయాలపై జరుగుతున్న దాడులను హిందూ సమాజంపై జరుగుతున్న దాడులుగా ఉడిపి పెజావర్ పీఠాధిపతి, అయోధ్య రామమందిర్ కోర్ కమిటీ సభ్యుడు (దక్షిణ భారత ప్రతినిధి) విశ్వప్రసన్న తీర్థ పెజావర్ స్వామీజీ అభివర్ణించారు.
అంతర్వేదిలో రథం దగ్ధం, ఆలయాల్లో పూజారులపై దాడులు, రామతీర్థంలో విగ్రహ ధ్వంసం ఘటనల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. దేవాలయాలపై దాడుల నిరోధానికి రాష్ట్రప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంత జరుగుతున్నా రాష్ట్రప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తాన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లో వరుసగా దేవాలయాలపై జరుగుతున్న దాడుల గురించి కేంద్ర కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి లేఖ వ్రాసిన్నట్లు ఆయన తెలిపారు. శనివారం విజయనగరం జిల్లా రామతీర్థానికి వచ్చిన ఆయన రాముడి విగ్రహ ధ్వంసం గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం విజయనగరంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో మీడియాతో మాట్లాడుతూ దాడుల ఘటనలపై సమగ్ర విచారణ చేపట్టి, నిందితులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతకుముందు ఆయన సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు.

More Stories
చేనేత భారతీయ సంస్కృతి, స్వావలంబన, స్వభీమానం ప్రతీక
ఏపీలో ఆందోళన కలిగిస్తున్న కరోనా పాజిటివ్ కేసులు
రూ.1,240 కోట్లతో బళ్లారి- గుంతకల్లు రైల్వే ప్రాజెక్ట్