ఎస్సీ-ఎస్టీ అత్యాచారాల కేసుల్లో 40 శాతం నకిలీ?

ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదవుతున్న మొత్తం కేసుల్లో 40 శాతం తప్పుడుగా నమోదు చేస్తున్నవేనని రాజస్తాన్ పోలీసులు  తెలిపారు. 2020లో రాజస్తాన్‌లో ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసులకు సంబంధించి ఆ రాష్ట్ర పోలీసులు డాటా విడుదల చేశారు. 

అంతే కాకుండా మహిళా అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసుల్లో కూడా ఇదే స్థాయిలో తప్పుడు కేసులు నమోదు అవుతున్నాయని వారు పేర్కొన్నారు. 39.55 శాతం కేసులు సరైనవి కావని, ఉద్దేశపూర్వకంగా తప్పుడుగా నమోదు చేస్తున్న కేసులని రాజస్తాన్ పోలీసులు తెలిపారు.

రాజస్తాన్ ప్రభుత్వం విడుదల చేసిన 2020 డేటా ప్రకారం ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదు అయ్యే కేసుల సంఖ్య 2019తో పోల్చుకుంటే పెరిగిందట. ఇందులో ఎస్సీలు నమోదు చేస్తున్న కేసులు 3 శాతం పెరిగాయని, ఎస్టీలు నమోదు చేస్తున్న కేసులు 5 శాతం పెరిగాయని డేటాలో తెలిపారు. 

ఇక మొత్తం కేసుల్లో ఎస్సీలు నమోదు చేసిన వాటిలో 42.17 శాతం కేసులు తప్పుడువని, ఎస్టీలు నమోదు చేసిన వాటిలో 40.04 శాతం కేసులు తప్పుడువని తేల్చి చెప్పారు. ఈ చట్టం కింద రాష్ట్రంలో 2020వ సంవత్సరంలో మొత్తం 7,017 కేసులు నమోదు అయ్యాయట.