భారత షట్లర్ సైనా నెహ్వాల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నేటి నుండి థాయిలాండ్ ఓపెన్ సూపర్-1000 ప్రారంభం కానున్న నేపథ్యంలో నిర్వాహకులు క్రీడాకారులందరికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో భారత్ ఎస్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు కరోనా సోకినట్టు తేలింది.
కరోనా వైరస్ కారణంగా దాదాపు 10 నెలలపాటు ఇంటికే పరిమితమైన సైనా థాయిలాండ్ ఓపెన్‌లో పాల్గొందామని సిద్ధమైన సమయంలో సైనాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తొలి రౌండ్‌లో మలేసియాకు చెందిన షట్లర్ కిసోనా సెల్వడురేతో సైనా తలపడాల్సి ఉంది.
అయితే కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆమెను టోర్నమెంట్ నుంచి తప్పుకోవాలని బీడబ్ల్యూఎఫ్ కోరింది. సైనాతోపాటు మరో భారత షట్లర్ ప్రణయ్ కూడా కోవిడ్ బారిన పడ్డాడు. కాగా వీరిద్దరిని ఆసుపత్రికి తరలించారు. కొద్ది రోజుల క్రితమే సైనా కరోనా నుండి కోలుకోగా, ఇప్పుడు ఆమెకు మళ్ళీ పాజిటివ్ రావడం ఆందోళన రేకెత్తిస్తుంది.

More Stories
భద్రతా మండలిలో త్వరిత సంస్కరణాలకై జి4 దేశాల పిలుపు
`మక్కా ఒప్పందం’ తర్వాత ఐరాసలో కాశ్మీర్ అంశం లేవనెత్తిన టర్కీ
గాజాలో నెలకొన్న పరిస్థితి “అత్యంత సిగ్గుచేటు”