జమ్మూ, కాశ్మీర్ లో 68 శాతం తగ్గిన ఉగ్రవాద ఘటనలు

జమ్మూ, కాశ్మీర్ లో 2020లో ఉగ్రవాద ఘటనలు 68 శాతం వరకు తగ్గాయి. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం గత ఏడాది నవంబర్ 15 వరకు, అంతకు ముందు ఏడాది అదే సమయం వరకు జరిగిన ఉగ్రవాద ఘటనలతో పోల్చుకొంటే 67.93 శాతం తగ్గాయి. 
 
అదే సమయంలో మృతి చెందిన భద్రతా దళాల సంఖ్య 29.11 శాతం, మృతి చెందిన పౌరుల సంఖ్య 14. 28 శాతం తగ్గాయి. ఆర్టికల్ 370 రద్దు వరకు జమ్మూ, కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి అమలు కాకుండా ఉన్న  కేంద్ర, రాష్ట్ర చట్టాలను అమలు పరచడం వల్లననే ఉగ్రవాదం అదుపులోకి వస్తున్నదని హోమ్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 
 
ఆర్టికల్ 370 రద్దు తర్వాత 48 కేంద్ర చట్టాలు, 167 రాష్ట్ర చట్టాలను అమలులోకి తీసుకు వస్తూ ఉత్తరువులు జారీ చేశారు. అదే విధంగా లడఖ్ లో 44 కేంద్ర చట్టాలు, 148 రాష్ట్ర చట్టాలను అమలులోకి తీసుకు వస్తూ ఉత్తరువులు జారీ చేశారు.