
గత నెలలోనే బీజేపీఐలో చేరిన టిఎంసి మాజీ మంత్రి సుబేందు అధికారి కార్యాలయంపై తృణమూల్ కార్యకర్తలు దాడి చేశారని ఆదివారం బీజేపీ ఆరోపించింది. నందిగ్రామ్ ప్రాంతంలోని సుబేందు కార్యాలయంపై దాడి చేసిన తృణమూల్ కార్యకర్తలను వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ డిమాండ్ చేశారు.
‘‘ఈ దాడిని వ్యతిరేకిస్తూ మేం నిరసన వ్యక్తం చేస్తున్నాం. అధికారం చేతిలో ఉందని ఇష్టమున్నట్లు చేస్తున్నాం. వారు అధికారంలో ఉన్నారు కాబట్టే ఇలా ప్రవర్తిస్తున్నారు.’’ అని బీజేపీ నేత కనిష్కా పాండ మండిపడ్డారు.
ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని తాము అధికారులను కోరామని తెలిపారు. వారిని అరెస్ట్ చేయకుంటే, ఈ దాడిలో అధికారుల ప్రమేయం ఉందని తాము భావించాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.
More Stories
ప్రెస్ మీట్ లో ఫోన్ నెంబర్ ఇచ్చి చిక్కుల్లో రాహుల్!
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
బంధుప్రీతి లేని ఏకైక ప్రదేశం ‘సైన్యం’