ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ వేటు వేసింది. ట్రంప్ ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. అధ్యక్షునిగా ఆయన పదవీ కాలం ముగిసే వరకు తమ సంస్థకు చెందిన ఆయన సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేస్తున్నట్లు ఫేస్బుక్ ప్రకటించిన .కొన్ని గంటలకు ట్విట్టర్ ఈ అనూహ్య ప్రకటన చేసింది.
ట్రంప్ ఇటీవల చేసిన ట్వీట్లు, .వాటి చుట్టూ ఉన్న సందర్భాలను నిశితంగా సమీక్షించిన తర్వాత..హింసను ప్రేరేపించే ప్రమాదం ఉన్నందున ఈ ఖాతాను శాశ్వతంగా నిలిపివేస్తున్నామని ట్వీట్ చేసింది. క్యాపిటల్ హౌస్లో దాడి జరగడానికి ఈ సామాజిక మాధ్యమాలు తోడ్పడ్డాయన్న విమర్శలు రావడంతో ఈ నిర్ణయాలను సదరు సంస్థలు తీసుకున్నాయి.
తన మద్దతుదారులను ఉద్ధేశించి ఆయన మాట్లాడిన వీడియో సహా మూడు ట్వీట్లను కూడా ట్విట్టర్ తొలగించింది. ఈ ట్వీట్లు కంపెనీ విధానాలను వ్యతిరేకంగా..హింసను ప్రేరేపించేవిగా ఉన్నాయంటూ ట్విట్టర్ పేర్కొంది. కాగా, వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాను నిలిపివేయడంతో..ఆయన తన అధికారిక ట్విట్టర్ ద్వారా వరుస ట్వీట్లు చేశారు. నిమిషాల్లో ఆ ట్వీట్టు కూడా సంస్థ తొలగించింది.
ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 20వ తేదీన జో బైడెన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యేది లేదని ప్రకటించారు. ‘చాలా మంది దీని గురించి అడుగుతున్నారు… నేను దానికి వెళ్లడం లేదు’ అని శుక్రవారం ట్వీట్ చేశారు.
More Stories
డొనాల్డ్ ట్రంప్ సమీపంలో కాల్పులు.. మరోసారి హత్యాయత్నం?
బంగ్లాదేశ్ లో నమాజ్ సమయంలో దుర్గాపూజపై ఆంక్షలు
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై భారత్ జయకేతనం