గోల్కొండ వరకు బిజెపి జైత్రయాత్ర ఆగదు    

ఇందూరులో మొదలైన బీజేపీ జైత్రయాత్ర గోల్కొండ కోటపై కాషాయజెండా ఎగిరే వరకూ ఆగదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇన్‌ చార్జి తరుణ్‌ఛుగ్‌ స్పష్టం చేశారు. నిజామాబా ద్‌ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు ఇందల్వాయి టోల్‌గేట్‌ వద్ద పార్టీ కార్యకర్తలు బైక్‌ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. 

అనంతరం బోధన్‌లో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్‌ నేత మేడపాటి ప్రకాశ్‌రెడ్డి తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా తరుణ్‌ఛుగ్‌ మాట్లా డుతూ 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుం దని, బహుజనులకు ముఖ్యమంత్రి పీఠం అందుతుందని భరోసా వ్యక్తం చేశారు. 

ఇందూరులో బీజేపీ ర్యాలీని చూసి సీఎం కేసీఆర్‌కు గుబులు మొదలైందని, అందుకే ఆస్పత్రిలో చేరా రని ఎద్దేవా చేశారు. ఒవైసీ సోదరులకు ఆయన తొత్తు గా పని చేస్తున్నారని దుయ్య బట్టారు. యుద్ధం బులెట్లతో కాదు.. బ్యాలెట్‌తో జరగాలని చెప్పారు. నిజాం వారసుల అరాచకాలు తెలంగాణలో చెల్లవని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి పీఠం దక్కే వరకు పోరాటం ఆపొద్దని పార్టీ కార్యకర్తలకు తరుణ్‌చుగ్ సూచించారు. 

రాష్ట్రంలో పసుపు రైతులకు అండగా ఉంటామని, మద్దతు ధర అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకుళ్తామని ఛుగ్‌ భరోసా ఇచ్చారు. కేసీఆర్‌ కుటుంబ అక్రమాలపై విచారణ చేపడతామని స్పష్టం చేశారు.

సీఎం కేసీఆర్‌ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆకాంక్షించారు. తమ పార్టీ ఎవరి నాశనమూ కోరుకోదని చెబుతూ ప్రజలను నాశనం చేసేది టీఆర్‌ ఎస్సేనని ధ్వజమెత్తారు. కుల సంఘాల పేరుతో హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఒక్కటేనని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ నాయకుల డ్రామాలను ప్రజలు నమ్మరని చెప్పారు. ప్రజా సంక్షేమాన్ని సీఎం కేసీఆర్ విస్మరించారని చెబుతూ  ప్రజలను మభ్యపెడుతున్న కారు పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపిచ్చారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన కర్మ బీజేపీకి పట్టలేదని సంజయ్ స్పష్టం చేశారు. 

ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మాట్లాడుతూ  ఇందూరు యు వత అంతా బీజేపీ వైపు చూస్తోందని పేర్కొన్నారు. ఆభివృద్ధి విషయంలో బోధన్‌కు సీఎం కేసీఆర్‌ అన్యాయం చేశారని ఆరోపించారు.