ఆంధ్రప్రదేశ్ లో విగ్రహాల ధ్వంసం పరంపర 

వై విశ్వనాథ్ 
 
ఇటీవలే విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరామచంద్రుని విగ్రహం ధ్వంసం చేసిన ఘటన ఉత్తరాంధ్రలో కలకలం రేపింది. చివరకు రామయ్య తండ్రి విగ్రహభాగాన్ని భక్తులు గాలించి పట్టుకోగలిగారు. రోజంతా రామతీర్థంలో భక్తుల ఆందోళన మిన్నంటింది.

తాజాగా రాజమహేంద్రవరంలో   సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి విగ్రహం రెండు చేతులను దుండగులు నరికివేశారు. దీంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రామతీర్థం, రాజమండ్రి ఘటనలు మరుపు రాకముందే కర్నూల్ జిల్లా కోసిగి మండలం మర్లబండలో మరో ఘటన చోటు చేసుకుంది. 

 
స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలోని సీతారాముల విగ్రహాన్ని ధ్వంసం చేశారు.  గోపురంపైనున్న విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. అంతేగాక ముఖద్వారం కడ్డీలు తొలగించి హుండీలను అపహరించారు. విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఆంజనేయ స్వామి గుడిలో వరుసగా విగ్రహాలు ధ్వంసంఅయ్యాయి. రొంపిచెర్ల వేణుగోపాలస్వామి విగ్రహం పగలగొట్టారు. నెల్లూరు జిల్లా బిట్రగుంట వేంకటేశ్వర స్వామి ఆలయంలో రథం దగ్ధంఅయింది. అంతర్వేది లో లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం అయింది..
 
విజయవాడ దుర్గగుడిలో సింహంబొమ్మలు ఎత్తుకెళ్లిపోయారు. ఏలేశ్వరంలోని ఆంజనేయస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. క్రిష్ణా జిల్లా మక్కపేటలో నంది విగ్రహాన్ని ధ్వంసం చేసేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ లో ఆంజనేయస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు.  
 
అటు పాడేరు అటవీ ప్రాంతంలోని అమ్మవారి విగ్రహ పాదాలు పగల గొట్టేశారు.  కర్నూలు జిల్లా ఆదోనిలోని ఆంజనేయస్వామి విగ్రహాన్ని ధ్వంసంచేశారు. 
 
జగన్ పాలనలో 2019 నుండి దేవాలయలపై జరిగిన దాడులు: 

1. గుంటూరు దుర్గ గుడి ద్వoసం – 14 నవంబర్  2019

2. పిఠాపురం ఆంజనేయ స్వామి గుడి 23 విగ్రహులు ధ్వంసం  – 21 జనవరి 2020

3.రోంప్పిచెర్ల వేణుగోపాల స్వామి గుడి విగ్రహాలు ధ్వంసం  – 11 ఫిబ్రవరి 2020

4.ఉండ్రాజవర మండలం సూర్యవుపాలం అమ్మవారి గుడి ముఖ ద్వారం దుండగులు ధ్వంసం – 13 ఫిబ్రవరి 2020

5.నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో ప్రసన్న వెంకటేశ్వరా ఆలయ రధం దగ్ధం
– 14 ఫిబ్రవరి 2020

6.అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రధ దగ్ధం – 6 సెప్టెంబర్  2020

7.విజయవాడ దుర్గ గుడి రధ వెండి సింహాలు చోరీ – 13 సెప్టెంబర్ 2020

8.కృష్ణ జిల్లా నిడమానూరులో సాయి బాబా విగ్రహాలు ద్వాంసం – 15 సెప్టెంబర్  2020

9.ఏలేశ్వరం శ్రీ సీతారామాంజనేయ వ్యాయమ కళాశాలలో ఆంజనేయ స్వామి విగ్రహం ద్వాంసం – 16 Sept2020

10.గుంటూరు జిల్లా వెల్దుర్తి గ్రామం నుండి గుండ్లపాడు వెళ్లే దారిలో కొండపైన ఉన్న నాగమయ్య గుడిలో దేవతా ప్రతిమలు ద్వంసం – 16 సెప్టెంబర్  2020

11.కృష్ణ జిల్లా వత్సవాయి మండలం మక్కపేట గయంలో కాశి విశ్వేశ్వర ఆలయంలో తలుపులు., నంది విగ్రహం ధ్వంసం  — 17 సెప్టెంబర్  2020

12.విశాఖ జిల్లా చింతపల్లి గ్రామం చిలకల మామిడి విధి శివారులో
శివాలయంలో శివుడు విగ్రహాలు ద్వoసం – 19 సెప్టెంబర్ 2020

13.పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నరసాపురం వెళ్లే రోడ్ మార్గంలో వున్న అయ్యప్ప స్వామి మండపంలో అయ్యప్ప చిత్రపటాలు , విగ్రహం ద్వoసం – 20 సెప్టెంబర్ 2020

14.కర్నూల్ జిల్లా పత్తికొండ పట్టణ మార్కెట్ యార్డ్ సమీపంలో వున్న ఆంజనేయ స్వామి విగ్రహం ద్వoసం – 23 సెప్టెంబర్  2020

15.నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ తుమ్మూరు నందు ఆంజనేయస్వామి విగ్రహం ద్వoసం – 25 సెప్టెంబర్  2020

16.కర్నూల్ జిల్లా మంత్రాలయం మండలం వుగురు కి కిమీ దూరంలో వున్న సుగని జలాషేయం దెగ్యరా వున్నా శ్రీలక్ష్మి నరసింహ స్వామి దేవలయంలో
నరసింహ స్వామి శేషపడగలు ద్వoసం – 5 అక్టోబర్ 2020

17.కర్నూల్ జిల్లా ఆదోనిలో ఓవర్ బ్రిడ్జి కింద వున్న ఆలయంలో ఆంజనేయ  స్వామి విగ్రహం ధ్వంసం  – 6 అక్టోబర్ 2020

18.గుంటూరు జిల్లా నరసారావు పేట శంకర మఠం సమీపంలో వున్నా సరస్వతి దేవి విగ్రహం ద్వoసం – 6 అక్టోబర్ 2020

19.తర్లపాడు గ్రామం శ్రీవీరభద్ర స్వామి దేవస్థాన గోపురం ద్వాంసం – 17 అక్టోబర్ 2020

20.యానాం బైపాస్,లచ్చిపాలెం గ్రామం, తూ.గో జిల్లా లో ఆంజనేయ స్వామి వారి విగ్రహం ద్వంసం..

21.విజయనగరం జిల్లాలోని 400 ఏళ్ల చరిత్ర గల ప్రముఖ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం అయిన రామతీర్థం కొండపై గల దేవాలయం లోకి కొందరు దుండగులు ఉద్దేశపూర్వకంగా ఆలయంలోకి ప్రవేశించి విగ్రహాల ధ్వంసం.