పరిమితంగా బ్రిటన్ భారత్ విమానాలు

పరిమితంగా బ్రిటన్ భారత్ విమానాలు

భారత్ బ్రిటన్ మధ్య విమానాల పునరుద్ధరణ ఈ నెల 8నుంచి జరుగుతుంది. అయితే ఇవి పరిమిత సంఖ్యలో, క్రమపద్థతిలో నడుస్తాయని కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. 

బ్రిటన్‌లో కరోనా కొత్త రకం వ్యాప్తి నేపథ్యంలో ఇటీవలే విమానాల రాకపోకలు నిలిచిపొయ్యాయి. పరిస్థితులను సమీక్షించి విమానాల నిర్వహణను ఇప్పటి నుంచి ఈ నెల 8 23వరకూ పరిమితంగా సాగిస్తారు. వారానికి 15 విమానాల రాకపోకలు ఉంటాయి. భారత్, యుకెలకు చెందిన విమానాలను అనుమతిస్తారు.

దేశం నుంచి బ్రిటన్‌కు కేవలం ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, ముంబైల నుంచే నిర్వహిస్తారు. పౌరవిమానయాన శాఖ త్వరలోనే వీటికి సంబంధించిన వివరాలను తెలియచేస్తుందని మంత్రి వివరించారు. 

పలు రకాల కొవిడ్ నిబంధనల అమలు మధ్యనే విమానాల రాకపోకలకు అనుమతి ఇస్తారు. బ్రిటన్‌కు విమానాలను ముందు డిసెంబర్ 31వరకూ రద్దు చేశారు.తరువాత బుధవారమే పౌర విమానయాన శాఖ వెలువరించిన ఉత్తర్వులలో ఈ నిలిపివేత జనవరి 31 వరకూ ఉంటుందని తెలిపింది. 

అయితే ఇప్పుడు బ్రిటన్ నుంచి ఇతర దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ విమానాలను ఈ నెల 7వ తేదీవరకూ నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.