అమెజాన్ కిండిల్‌పై భగ్గుమంటున్న నెటిజెన్లు

అమెజాన్‌కు చెందిన అమెజాన్ కిండిల్‌పై నెటిజెన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ‘‘యాంటీ హిందూ అమెజాన్ కిండిల్’’ (అమెజాన్ కిండిల్ హిందూ వ్యతిరేకి) అంటూ ట్విట్టర్‌లో ట్రోల్స్ వేస్తున్నారు. భారత దేశ సంప్రదాయలను హిందువుల మనోభావాలను అమెజాన్ గౌరవించడం లేదని, అమెజాన్‌ను ఇండియా నుంచి బాయ్‌కాట్ చేయాలంటూ నెటిజెన్లు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.

అమెజాన్ కిండిల్ ఆన్‌లైన్‌లో చాలా పుస్తకాలు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. అయితే అందులో కొన్ని పుస్తకాల కవర్ పేజీలపై నెటిజెన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ‘ఇండియన్ హిందూ వైఫ్ అఫైర్.. విత్ హర్ ముస్లిం లవర్స్’ అనే పుస్తకాన్ని ఎక్కువ మంది నెటిజెన్లు చర్చకు తెస్తున్నారు.

ఈ పుస్తకం కవర్ పేజీపై ఒక స్త్రీ, ఒక పురుషుడి ఫొటోలను ముద్రించారు. ఇందులో స్త్రీ హిందూ మహిళగా కనిపించగా, పురుషుడు ముస్లిం వ్యక్తిగా కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఆ కవర్‌ ఫొటోపై ఉన్న స్త్రీ కాస్త అశ్లీలంగా కూడా ఉంది. దీనిపై నెటిజెన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

స్వాతి గోయెల్ శర్మ అనే పేరుతో ఉన్న ఒక ట్విట్టర్ యూజర్ ‘ఇండియన్ హిందూ వైఫ్ అఫైర్.. విత్ హర్ ముస్లిం లవర్స్’ అనే పుస్తకం ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘అమెజాన్ కిండిల్ పూర్తిగా అశ్లీల సాహిత్యంతో నిండిపోయి ఉంది. ముస్లిం పురుషులను హిందూ మహిళలు గల అత్యాచార ఫాంటసీలపై రాసిన పుస్తకాలను ఇదులో అమ్ముతున్నారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

“‘ఇండియన్ హిందూ వైఫ్స్ అఫైర్స్’ వంటి శీర్షికతో టోపీతో ఉన్న పురుషుడిని అశ్లీలంగా ఉన్న మహిళను చూపిస్తున్న కవర్ ఫొటోలు చాలానే ఉన్నాయి. డజన్ల సంఖ్యలో రచయితలు రాసిన ఇలాంటి పుస్తకాలు అమెజాన్ కిండిల్‌లో చాలానే ఉన్నాయి’’ అని రాసుకొచ్చారు.