
కరోనా నిబంధనల గడువును మరోసారి పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 31 వరకు కరోనా మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలే జనవరి 31 వరకు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న కారణంగా నిబంధనలు పాటించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. బ్రిటన్ లో కలకలం సృష్టించి కరోనా కొత్త వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు నిఘా, వైరస్ కట్టడికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. అంతేకాదు కంటైన్ మెంట్ జోన్ల గుర్తింపు, ఆ జోన్లలో కఠినంగా వ్యవహరించాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాలను కోరింది.
వైరస్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో నిర్దేశించిన నియంత్రణ చర్యలు కచ్చితంగా పాటించాలని తెలిపింది. నవంబర్ 25న కేంద్ర హోం శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలనే రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు అమలు చేయాలని స్పష్టం చేసింది.
More Stories
జార్ఖండ్లో 8 మంది మావోయిస్టులు మృతి
అమర్నాథ్ యాత్రకు 533 బ్యాంకుల్లో రిజిస్ట్రేషన్లు!
దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి డి విటమిన్ లోపం