నాగపూర్‌లో భారత వైమానిక దళ అధికారిని వివాహం చేసుకున్న 24 ఏళ్ల మహిళ ఒకరు, తనపై అత్యాచారం జరిగిందని ఆరోపించారు. మత్తుమందు ఇచ్చి తనపై అత్యాచారం చేశారని, అసభ్యకరమైన వీడియోలతో తనను బ్లాక్‌మెయిల్ చేశారని, ఆ తర్వాత బలవంతంగా మత మార్పిడికి పాల్పడేలా చేశారని ఆమె పేర్కొన్నారు.
ప్రధాన నిందితుడైన ఒక మత గురువు, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా తనను వివాహం చేసుకోవాలని కూడా ఆమెపై ఒత్తిడి తెచ్చారు. ఈ కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడు. మతమార్పిడి చేస్తున్నట్లుగా ఉన్న ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
వదిలేయ్ అని ఆ మహిళ అరుస్తున్నా ఓ వ్యక్తి ఇస్లామిక్ మంత్రాలు చదువుతూ ఆమెను లోబరుచుకునే ప్రయత్నం చేశాడు.
నాగ్‌పూర్ పోలీసుల వివరాల ప్రకారం, సదరు మహిళ ఫిర్యాదు ఆధారంగా సోనెగావ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అరెస్టయిన నిందితులను కల్మేశ్వర్ నివాసి అయిన అయ్యాజ్ తాజ్ మదారే, అమీన్ షేక్‌లుగా గుర్తించారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాకు చెందిన తామియా ప్రాంత నివాసి అయిన మూడవ నిందితుడు హజ్రత్ మౌలానా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు ఒక పోలీసు బృందాన్ని తామియాకు పంపారు.
తనను బలవంతంగా సంబంధం పెట్టుకునేలా చేశారని, అలాగే డబ్బు కోసం వేధించారని, మత మార్పిడి కోసం ఒత్తిడి చేశారని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (జోన్ 1) సింగారెడ్డి రుషికేష్ మంగళవారం తెలిపారు. “ఫిర్యాదు అందిన వెంటనే మేము ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, ఇద్దరు నిందితులను అరెస్టు చేశాము. మొబైల్ ఫోన్ల నుండి డిజిటల్ సాక్ష్యాలను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నాము. ప్రచారంలో ఉన్నట్లుగా చెబుతున్న వీడియోలను సేకరించి, వాటిని ధృవీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది,” అని డీసీపీ పేర్కొన్నారు.
పోలీసుల కథనం ప్రకారం నిందితుడు అయ్యాజ్ తాజ్ మాదరే, బాధిత మహిళ గతంలో ఒకే స్కూల్‌లో చదువుకున్నారు. ఓ ప్రాపర్టీ వివాదం నేపథ్యంలో ఆ ఇద్దరు కలుసుకున్నారు. 2025 ఫిబ్రవరిలో ఓ హోటల్‌లో ఆ సమావేశంజరిగింది. అప్పుడు ఏదో మత్తు పదార్ధాన్ని తనకు ఇచ్చినట్లు ఆ మహిళ ఫిర్యాదు చేసింది. అసభ్యకరమైన రీతిలో ఉన్న ఫోటోలు, వీడియోలను తీస ఆమెను బెదిరించడం ప్రారంభించారు.
మే 31వ తేదీన తనను కల్మేశ్వర్ ప్రాంతానికి తీసుకెళ్లారని, అక్కడ మతమార్పిడి పూజను చేశారని ఆమె పేర్కొన్నది. తన ఇష్టం లేకుండానే మతమార్పిడి చేయించి, ప్రధాని నిందితుడితో పెళ్లి జరిగినట్లు చెప్పారని ఆమె తన ఫిర్యాదులో వెల్లడించింది.

More Stories
డాక్టర్ ప్రిస్క్పిప్షన్ ఉంటేనే దగ్గు సిరప్లు
నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రాం యాప్ నిషేధం
ఆలస్యమైన ‘నైరుతి’ ఉన్నట్టుండి కనుమరుగయ్యిందా?