అరుణాచల్ ప్రదేశ్‌లోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. పాసీఘాట్ మునిసిపల్ కౌన్సిల్‌లో (పీఎంసీ) మొత్తం ఎనిమిది స్థానాలకు ఆరింట్లో గెలుపొందింది. కాంగ్రెస్ రెండు వార్డుల్లో విజయం సాధించింది. ఈటానగర్ మునిసిపల్ కార్పొరేషన్ (ఐఎంసీ) ఎన్నికల్లో మొత్తం 20 స్థానాల్లో 10 సీట్లను బీజేపీ తన ఖాతాలో వేసుకొంది. అధికారానికి ఒక సీటు దూరంలో నిలిచింది. జేడీయూ 9 సీట్ల ను, ఎన్‌పీపీ ఒక సీటును గెలుపొందాయి. కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటూ దక్కలేదు.
అలాగే పంచాయత్ ఎన్నికల్లోనూ బీజేపీ సంపూర్ణ మెజారిటీ సాధించింది. మొత్తం 137 జిల్లా పరిషత్ సభ్యుల సీట్లలో 121 స్థానాల్లో విజయం సాధించింది. అలాగే 8,215 గ్రామ పంచాయతీ సభ్యుల స్థానాల కు జరిగిన ఎన్నికల్లో కూడా 2,668 సీట్లలో గెలుపొందింది. ఈ నెల 22న ఎన్నికలు జరగడానికి ముందే మొత్తం 240 జిల్లా పరిషద్ సభ్యులలో 96 సభ్యులను, 8,291 గ్రామా పంచాయత్ సభ్యులలో 5,410 సభ్యులను, ఇతానగర్ మునిసిపల్ కార్పొరేషన్ లో 5 గురు కార్పొరేటర్లను బిజెపి ఏకగ్రీవంగా గెల్చుకొంది.
అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు గెలుపొందిన బిజెపి అభ్యర్థులను అభినందిస్తూ పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేయడంతోనే ఈ విజయం సాధ్యమైనదని తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా మార్గదర్శకాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బాసటగా నిలుస్తుందని మరోసారి రుజువైనదని సంతోషం వ్యక్తం చేశారు.
More Stories
భారత్ భద్రతను దెబ్బతీసేలా వ్యవహరించం
జార్ఖండ్లో ఎన్నార్సీని అమలు చేస్తాం
తుది దశకు చేరుకున్న వామపక్ష తీవ్రవాదం