జమ్మూకాశ్మీర్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ

కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత జమ్మూకశ్మీర్‌లో జరిగిన తొలి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో తొలి ఎన్నికల్లో జమ్మూ ప్రాంతంలో బీజేపీ గట్టి పట్టు సాధించిన బిజెపి మొత్తం మీద అతిపెద్ద ఏకైక రాజకీయ పార్టీగా నిలిచింది.
 
నేషనల్ కాన్ఫరెన్స్, మెహబూబా ముఫ్తీ సారథ్యంలోని డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) సహా జమ్మూకశ్మీర్‌లోని ఏడు పార్టీలతో కూడిన గుప్కార్ అలయెన్స్ 108 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 75 స్థానాల్లో, కాంగ్రెస్ 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.  మొత్తం 280 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 
జమ్మూ ప్రాంతంలో హిందువులు అత్యధికంగా ఉన్న ఉధంపూర్, కథువా, సాంబ జిల్లాల్లో బిజెపి మొత్తం 56 సీట్లు 49ఉండగా  సీట్లలో గెలుపొందింది. జమ్మూలో కనీసం ఆరు జిల్లా అభివృద్ధి మండలిలపై బిజెపి ఆధిపత్యం వహించగా, కాశ్మీర్ లో గల 9 జిల్లా మండలిలలో కూడా గుప్కార్ ఆధిక్యత సాధించింది. మరో ఐదు ఎవ్వరికీ స్పష్టమైన ఆధిక్యత లేకపోగా, ఒక చోట స్వతంత్ర అభ్యర్థులు కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తున్నది. 

ఈ ఫలితాలను ప్రజలు ఆర్టికల్ 370 తిరక్సరించడంగా గుప్కార్ నేతలు అభివర్ణిస్తుండగా, బులెట్లు, గ్రెనేడ్ లతో తిరిగిన పోరాటంలో ప్రజలు ప్రజాస్వామ్యంకు అనుకూలంగా స్పష్టమైన తీర్పు ఇచ్చారని ఈ ఎన్నికల బిజెపి ఇన్ ఛార్జ్, సైడ్ సాహ్వనాజ్ హుస్సేన్ పేర్కొన్నారు. శాంతియుతంగా, స్వేచ్ఛగా, న్యాయబద్దంగా జరిగిన ఎన్నికలలో రికార్డు స్థాయిలో ఓటర్లు పాల్గొనడం గుప్కార్ కూటమికి చెంపపెట్టు అని ధ్వజమెత్తారు. మొత్తం మీద 51 శాతం ఓట్లు పాలు కావడం గమనార్హం.

జమ్మూ ప్రావిన్స్‌లో బీజేపీ 57 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, గుప్కార్ అలయెన్స్ 37 స్థానాల్లో విజయం సాధించింది. కశ్మీర్‌లో ప్రాంతంలో గుప్కార్ అలయెన్స్ 71 స్థానాల్లో  అధిక్యంలో ఉండగా, బీజేపీ మూడు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఒక్కో జిల్లాలో 14 చొప్పున 20 జిల్లాలోని 280 స్థానాలకు 25 రోజుల వ్యవధిలో 8 దశల్లో ఎన్నికలు జరిగాయి.

గుప్కార్ అలయెన్స్ విజయం దిశగా దూసుకుపోతున్నప్పటికీ ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ వంటి మాజీ ముఖ్యమంత్రుల నివాసాలున్న గుప్కార్ రోడ్డులో ఎటువంటి సంబరాలు కనిపించలేదు. వీరెవరూ తమ అభ్యర్థుల కోసం ప్రచారం చేయకపోవడం గమనార్హం. 

జమ్మూలో ముస్లింల ఆధిక్యత గల చీనాబ్, పీర్ పంజాల్ ప్రాంతాలలో కూడా బిజెపి ప్రధాన రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది. మొదటిసారిగా కాశ్మీర్ లోయలో సహితం మూడు సీట్లలో గెలుపొంది బిజెపి తన ఉనికి కాపాడుకోంది. సాక్షినా, ఉత్తర, మధ్య కాశ్మీర్ ప్రాంతాలలో ఒకొక్క స్థానం గెల్చుకొంది.