జీఎస్టీ నష్టపరిహార లోటును భర్తీ చేసేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు 8వ వార్షిక వాయిదాగా రూ. 6,000 కోట్లను విడుదల చేసింది. ఈ మొత్తం సొమ్ములో రూ. 5,516.60 కోట్లను 23 రాష్ట్రాలకు విడుదల చేయగా, రూ. 483.40 కోట్లను శాసన సభలు కలిగి, జిఎస్టీ కౌన్సిల్‌లో సభ్యులైన మూడు కేంద్ర పాలిత ప్రాంతాలు (ఢిల్లీ, జమ్ము-కాశ్మీర్, పుదుచ్చేరీ)కు విడుదల చేసింది.
జిఎస్టీ అమలు కారణంగా ఆదాయ అకౌంట్‌లో మిగిలిన ఐదు రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, సిక్కింకు ఎటువంటి లోటు ఏర్పడలేదు. ప‌్రస్తుత సంవత్సరం -2020-2021 కాలంలో జిఎస్‌టి వసూలులో ఏర్పడిన 1.10 లక్షల కోట్ల లోటు సమస్యను పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేక రుణ గవాక్షాన్ని సృష్టించింది.
ఈ గవాక్షం ద్వారానే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల తరఫున భారత ప్రభుత్వం రుణాలు ఇస్తోంది. ఇప్పటివరకు 7 విడతలుగా రుణాలు విడుదల చేయడం జరిగింది. రాష్ట్రాలు కోరిన రుణాన్ని 23 అక్టోబర్, 2020, 2 నవంబర్,2020, 9 నవంబర్,2020 – 23 నవంబర్, 2020 – 1 డిసెంబర్ 2020- 7 డిసెంబర్, 2020 – 14 డిసెంబర్ 2020 – 21 డిసెంబర్ 2020న విడుదల చేయడం జరిగింది.
రాష్ట్రాలకు అందించే నిధుల 8వ విడత మొత్తాన్ని ఈ వారం విడుదల చేశారు. ఈ వారం రుణంగా తీసుకున్న మొత్తంపై వడ్డీ రేటు 4.1902శాతంగా ఉంది. ఇప్పటివరకూ, ప్రత్యేక రుణ గవాక్షం ద్వారా కేంద్ర ప్రభుత్వం 4.6986% వడ్డీ రేటుతో రూ. 48,000 కోట్ల రూపాయిలను రుణంగా తీసుకుంది.
జిఎస్టీ అమలు కారణంగా ఏర్పడిన ఆదాయ లోటును పూడ్చేందుకు ప్రత్యేక రుణ గవాక్షం ద్వారా రుణాలకు అదనంగా భారత ప్రభుత్వం స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపి)లో 0.50శాతం మేరకు అదనపు రుణాన్ని తీసుకునేందుకు అనుమతిని ఇచ్చింది.
జిఎస్టీ నష్టపరిహార లోటును భర్తీ చేసేందుకు అదనపు ఆర్థిక వనరులను సమకూర్చునేందుకు ఆప్షన్ -1ని ఎంచుకున్న రాష్ట్రాలకు ఈ సౌకర్యాన్ని అందుబాటులో ఉంచింది. మొత్తం రూ. 1,06,830 కోట్లు (జీఎస్డీపీలో 0.50శాతం) మేరకు అదనపు నిధులను రుణంగా తీసుకునేందుకు ఈ సౌకర్యం కింద 28 రాష్ట్రాలకు అనుమతి ఇచ్చింది.
More Stories
ఆప్ ఎంపీ సంజీవ్ అరోరా ఇంట్లో ఈడీ సోదాలు
ఎస్బీఐలో కొత్తగా 10 వేల ఉద్యోగాలు
రూ.1,800 కోట్లకు పైగా విలువైన డ్రగ్స్ స్వాధీనం