ఆవు పెండతో తయారైన పెయింట్‌ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పరిచయం చేసి, దీనికి వేదిక్ పెయింట్ అని పేరు పెట్టారు. ట్విటర్ ద్వారా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అతి త్వరలోనే ఈ వేదిక్ పెయింట్‌ను లాంచ్ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
“గ్రామీణప్రాంత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి, రైతులకు అదనపు ఆదాయం సమకూర్చడానికి అతి త్వరలోనే ఆవు పెండతో తయారు చేసిన ఈ వేదిక్ పెయింట్‌ను లాంచ్ చేయబోతున్నాం. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ ద్వారా ఈ పెయింట్ తయారవుతోంది” అని గడ్కరీ ట్వీట్ చేశారు.
ఈ పెయింట్ డిస్టెంబర్, ఎమల్షన్ రూపాల్లో అందుబాటులో ఉంటుందని, కేవలం నాలుగు గంటల్లో ఆరిపోతుందని చెప్పారు. పర్యావరణ హితమైన ఈ పెయింట్ విష రహిత, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉంటుంది.
ఈ వేదిక్ పెయింట్ వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని పాడి రైతులు అదనంగా ఏడాదికి రూ.55 వేలు సంపాదిస్తారని గడ్కరీ అంచనా వేశారు.
More Stories
రెండు రైతు సంక్షేమ పథకాలకు రూ.లక్ష కోట్లు
స్టాక్ మార్కెట్లలో రూ.11లక్షల కోట్ల సంపద ఆవిరి
చైనా సీసీటీవీ కెమెరాలు, ఇతర నిఘా పరికరాలపై ఆంక్షలు!