బ్యాంకింగ్ మోసం గురించి స్టేట్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) వినియోగదారులను హెచ్చరిస్తోంది. వినియోగదారులకు వారి వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దని బ్యాంక్ సూచించింది. దీని గురించి బ్యాంక్ సోషల్ మీడియా ద్వారా సమాచారం ఇచ్చింది.
తప్పుదోవ పట్టించే, నకిలీ సందేశాల వలలో పడొద్దని, అంతే కాకుండా ఎవరికైనా మోసం జరిగితే వారు సైబర్ క్రైమ్‌కు తెలియజేయాలని పేర్కొంది. మోసపోతే https://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని బ్యాంక్ తెలిపింది.
కస్టమర్లు పాన్ వివరాలు, ఐఎన్‌బి ఆధారాలు, మొబైల్ నంబర్, యుపిఐ పిన్, ఎటిఎం కార్డ్ నంబర్, ఎటిఎం పిన్, యుపిఐ విపిఎ ఎవరితోనూ పంచుకోవద్దని ఎస్బిఐ కోరింది. ఎప్పటికప్పుడు ఎస్బిఐ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆన్లైన్ మోసం గురించి వినియోగదారులను అప్రమత్తం చేస్తుంది.
కొద్ది రోజుల క్రితం వాట్సాప్ కాల్స్ లేదా మెసేజ్‌లతో జాగ్రత్తగా ఉండాలని బ్యాంక్ ప్రజలను హెచ్చరించింది.
బ్యాంకు సూచనలు
* మీ వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు.
* మీ ఖాతా పాస్‌వర్డ్‌ను నిరంతరం మార్చుకోవాలి.
* మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలను ఫోన్, ఇమెయిల్ లేదా ఎస్ఎంస్ ద్వారా ఎప్పుడూ చెప్పకండి.
* అనుమానాస్పద లింక్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయవద్దు.
* ఏదైనా బ్యాంకుకు సంబంధించిన సమాచారం కోసం ఎల్లప్పుడూ ఎస్బిఐ అధికారిక వెబ్‌సైట్‌పై ఆధారపడండి.
* మోసగాళ్లపై ఫిర్యాదులకు స్థానిక పోలీసు అధికారులు లేదా సమీప ఎస్బిఐ శాఖను సంప్రదించండి.
More Stories
పిల్లల భవిష్యత్తు కు భరోసాగా “ఎన్పీఎస్ వాత్సల్య” నేడే ప్రారంభం
పునరుత్పాదక ఇంధన రంగంలో రూ. 32.5 లక్షల కోట్లు
సవాళ్ల సుడిగుండంలో ప్రపంచ ఆర్థికాభివృద్ధి