పాత చట్టాలతో రైతుల ఆత్మహత్యలు పెరిగాయి తప్ప ఆగలేదని కేంద్ర మంత్రి సంజీవ్ కుమార్ బల్యన్ ధ్వజమెత్తారు. మూడు కొత్త చట్టాలు కూడా రైతులకు లాభాన్ని తెచ్చేవి తప్ప నష్టాలు ఉండవని భరోసా వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్బర్ భారత్ పథకం లో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయగా, వ్యవసాయని లక్ష కోట్ల రూపాయలు ప్రధాని మోదీ కేటాయించారని గుర్తు చేశారు. కేంద్రం ప్రకృతి విపత్తుల కోసo కేంద్ర పసల్ బీమా పథకం తెచ్చిందని చెప్పారు. పత్తి రైతులకు మేలు చేసే మద్దతు ధర రూ.5,500 గా నిర్ణయించిందని పేర్కొన్నారు. రైతులు నూతన చట్టాల ద్వారా అధిక ధరలకు వారి పంటను అమ్ముకోవచ్చని తెలిపారు.
కేంద్రం ఇచ్చే నిధులను తెలంగాణ ప్రభుత్వం దారి మళ్లీoచి వేరే పథకాలకు కేటాయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత దేశంలో రైతులు అందరూ సంతోషంగా ఉన్నారంటూ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కేంద్ర పథకానికి ప్రభుత్వం అండగా ఉండటం లేదని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రంలో మంచి నాయకత్వo అవసరం ఉందని చెబుతూ అది బీజేపీ తోనే సాధ్యమని స్పష్టం చేశారు. కరోనా సమయంలో ప్రధాని మోడీ రూ 20 లక్షల కోట్ల రూపాయలు కేటాయించిన విషయం గుర్తు ఉంచుకోవాలని కోరారు. త్వరలో జరుగబోయే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ గెలిపించే అవసరం ఉందని చెబుతూ తెలంగాణలో అబివృద్ది చేయడానికి బీజేపీ అవసరం చాలా ఉందని చెప్పారు.
More Stories
ఈడీ విచారణకు కాంగ్రెస్ నేత అజారుద్దీన్
రుణమాఫీపై బహిరంగ చర్చకు రేవంత్ కు ఏలేటి సవాల్!
ముందు చెరువుల్లో దుర్గంధాన్ని తొలగించండి రేవంత్