కాంగ్రెస్ పై తిరుగుబాటు ధోరణిలో రేవంత్ రెడ్డి !

కాంగ్రెస్ లో కీలక పదవి అభిస్తుందని చేరి భంగపడి, గత ఏడాది లోక్ సభ కు ఆ పార్టీ అభ్యర్థిగా ఎన్నిక కావడంతో సర్దుకున్న ఎ రేవంత్ రెడ్డి మరోసారి పార్టీ అధిష్ఠానాన్ని నిలదీసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తున్నది. తనకు మాట ఇచ్చిన ప్రకారం పిసిసి నాయకత్వం అప్పజెప్పమని నిలదీస్తున్నారు. లేని పక్షంలో పార్టీపై తిరుగుబాటుకు కూడా సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది. 
 
నేరుగా రాహుల్ గాంధీని కలసి ఏదో ఒకటి తేల్చుకోవాలని రేవంత్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఈ విషయమై పార్టీ అధిష్ఠానం అనుసరిస్తున్న సాచివేత ధోరణి పట్ల తెలంగాణలోని పలువురు కాంగ్రెస్ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవంక, రేవంత్ రెడ్డిని ఎంపిక చేస్తే పార్టీపై తిరగబడడం కోసం పలువురు సీనియర్లు సిద్దపడుతున్నట్లు కూడా కధనాలు వెలువడుతున్నాయి. 
 
ముందుగా అసెంబ్లీ ఎన్నికలలో, తర్వాత లోక్ సభ ఎన్నికలలో వరుసగా కాంగ్రెస్ పార్టీని పరాజయాలవైపు నడిపించిన పిసిసి అధ్యక్షుడు ఎన్ ఉత్తమకుమార్ రెడ్డి గత ఏడాదే తన పదవికి రాజీనామా చేయించినా ఆయనను కోనసాగిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ తో లాలూచి పది, పార్టీ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నరని పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నా కాంగ్రస్ అధిష్ఠానం పట్టించుకోవడం లేదు. 
 
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో పార్టీ పరాభవం తర్వాత మరోసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవికి రాజీనామా చేశారు. ఉత్తమ్ స్థానంలో మరొకరిని నియమించాలని కొద్దీ నెలల ముందే పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నా ఫిబ్రవరి వరకు ఆగమని చెబుతున్నట్లు తెలుస్తున్నది. అయితే ఇప్పుడు మార్చకపోతే బిజెపి టి ఆర్ ఎస్ కు ప్రత్యామ్న్యాయంగా ఎదురుగున్నదనే ఆందోళన పార్టీ అధినాయకత్వంలో బయలు దేరింది. 
 
కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ మాణికం ఠాగూర్ సేకరించి, ఐదు పేర్లతో ఒక జాబితాను అధిష్ఠానంకు అందించారని తెలుస్తున్నది. వారిలో రేవంత్ రెడ్డి పేరు ముందునా వేరే పార్టీ నుండి వచ్చిన వారికి ఈ పార్టీ ఇస్తే తాము బిజెపిలోకి వెడతామనే సంకేతాన్ని కొందరు నేతలు ఇచ్చిన్నట్లు తెలుస్తున్నది.
 
ఇప్పటికే కాంగ్రెస్ నుండి లోక్ సభ ఎన్నికల ముందు వచ్చిన మాజీ మంత్రి డీకే అరుణ  బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు కావడం, పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి గత వారమే బీజేపీలో చేరడంతో మరి అనేకమంది కాంగ్రెస్ నేతలు కూడా చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. 
 
ఇటువంటి సమయంలో రేవంత్ రెడ్డికి పార్టీ నాయకత్వం అప్పగిస్తే తలెత్తే పరిణామాల గురించి పార్టీ నాయకత్వం ఆందోళనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ పదవి కోసం చాలాకాలంగా పోటీ పడుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ పడుతున్న తమకు కాకుండా రాజీగా మాజీ మంత్రి మరొకరిని చేసినా తామిద్దరికి అభ్యంతరం లేదని చెప్పడం ద్వారా రేవంత్ రెడ్డి పేరు పట్ల ఒక విధంగా విముఖతను వ్యక్తం చేశారు.  
దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన బిజెపి జీహెచ్ఎంసీ ఎన్నికల్లోఅఖండ విజయం సాధించడంతో తెలంగాణలో  కాంగ్రెస్ మరింత పతనావస్థకు చేరుకొన్నట్లే అనే అభిప్రాయం ఆ పార్టీ నేతలు పలువురిలో కలుగుతున్నది. దానితో తక్షణం నష్టనివారణ చర్యలు ప్రారంభించక తప్పడం లేదు.