వ్యాక్సిన్ సాకుతో స్థానిక ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం విముఖత 

రాష్ట్రంలో తొలి దశ కరోనా వాక్సినేషన్‌ పూర్తయ్యే వరకు స్థానిక ఎన్నికలను వాయిదా వేసేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఆదేశించాలని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి   ప్రభుత్వం హైకోర్టును కోరింది. వచ్చే ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలకు ఎస్‌ఇసి నవంబరు 17న ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను సవాల్‌ చేసిన కేసులో రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చే వేళ ఎన్నికలు నిర్వహించడం ప్రజారోగ్యం దృష్ట్యా సరికాదని తెలిపింది. లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులు వ్యాక్సినేషన్‌ నిల్వ, పంపిణీ, వంటి పనుల్లో నిమగం అవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. 

ప్రభుత్వం తరపున పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ మంగళవారం అదనపు అఫిడవిట్‌ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేస్తామని ఎస్‌ఇసి చెప్పడంతో విచారణను ఈ నెల 18కి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్‌ డివిఎస్‌ఎస్‌ సోమయాజులు ప్రకటించారు.