
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై కోల్‌కతాలో గురువారం జరిగిన రాళ్ల దాడిని ఖండిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు ముంబైలో శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై చర్య తీసుకోవాలని కోరుతూ మహారాష్ట్ర గవర్నర్ భగత్ కోషియారిని కలుసుకుని వినతిపత్రం సమర్పించేందుకు గవర్నర్ హౌస్ వరకూ కార్యకర్తలు నిరసన మార్చ్ నిర్వహించారు.
బెంగాల్ సిటిజన్ ఆఫ్ ఇండియా’ సభ్యులు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిష్టిబొమ్మలను కార్యకర్తలు దహనం చేయడం, ఆమె పోస్టర్లపై ఇంకు చల్లడం వంటివి ఈ ప్రదర్శనలో కనిపించాయి.
‘పట్టపగలే ప్రజాస్వామ్యం పీక నొక్కుతున్నారు. ఈ విషయం రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లి, పశ్చిమబెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరేందుకు గవర్నర్‌ను కలుస్తున్నాం’ అని బీజేపీ ఎమ్మెల్యే, ప్రతినిధి రామ్ కదమ్ మీడియాకు తెలిపారు.
డైమండ్ హార్బర్ వద్ద నడ్డా కాన్వాయ్‌పై గురువారం జరిగిన దాడిలో కైలాష్ విజయవర్గీయ సహా పలువురు పార్టీ నాయకులు గాయపడ్డారు. కోల్‌కతాలో నడ్డా రెండు రోజుల పర్యటన గురువారంతో ముగిసింది.
More Stories
రేపు మణిపూర్‌లో ప్రధాని మోదీ పర్యటన
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం