ఇకపై డీజిల్ కోసం పెట్రోల్ బంకుల చుట్టూ తిరగనవసరం లేదు. డీజిల్‌ను నేరుగా ఇంటికే తెప్పించుకోవచ్చు. టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా ఒక స్టార్టప్ ప్రారంభించనున్నారు. దీని సాయంతో డీజిల్ వాహనదారులు తమ ఇంటికే డీజిల్ తెప్పించుకోవచ్చు.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా సారధ్యంలో ఫ్యూయల్ స్టార్టప్ ప్రారంభం కానుంది. ఈ స్టార్టప్ రిపోస్ ఎనర్జీ భాగస్వామ్యంతో డీజిల్‌ను హోం డెలివరీ చేయనుంది. ఈ ప్రక్రియను వివిధ దేశంలోని వివిధ పట్టణాల్లో ప్రారంభించనున్నారు.
డోర్-టు-డోర్ డీజిల్ డెలివరీ చేసే ఈ స్టార్టప్ కంపెనీ… ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల భాగస్వామ్యంతో ఢిల్లీ, గుర్‌గావ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌లలో తన సేవలు ప్రారంభించింది. పూణె కేంద్రంగా ఏర్పాటయిన ఈ కంపెనీని చేతన్, అదితి భోస్లే ప్రారంభించారు.
మొబైల్ పెట్రోల్ పంపుల మాధ్యమంలో వీరు డీజిల్‌ను హోమ్ డెలివరీ చేస్తున్నారు. భవిష్యత్‌లో 3,200 రిపోస్ మొబైల్ పెట్రోల్ పంపులు ఏర్పాటు చేయాలని ఈ స్టార్టప్ ఒక ప్రణాళిక సిద్ధం చేసింది. రిపోస్ ఎనర్జీ స్టార్టప్ 2016లో ప్రారంభమైంది. ఇప్పటివరకూ 130 పట్టణాల్లో 300 రిపోస్ మొబైల్ పెట్రోల్ పంపుల ద్వారా తన సేవలు అందిస్తోంది.
More Stories
సంచలన ఆరోపణలు చేసే హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మూసివేత
భారత్‌కు క్షమాపణలు చెప్పిన మెటా సంస్థ
కేజ్రీవాల్‌పై ఈడీ విచారణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్