ఆగస్ట్ నాటికి 30 కోట్ల మంది భారతీయులకు వ్యాక్సిన్

2021 జూలై, ఆగస్ట్ నాటికి 30 కోట్ల మంది భారతీయులకు కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు  కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి  హర్ష్‌వర్ధన్ ప్రకటించారు.
2021 జనవరి నుంచి మూడునాలుగు నెలల పాటు దేశ ప్రజలకు వ్యాక్సిన్‌ను అందించే అవకాశాలపై పూర్తిగా దృష్టి సారించనున్నట్లు ఆయన తెలిపారు. ఈలోపు సరిపడా వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచుకోవాలని కేంద్రం భావిస్తున్నట్లు మంత్రి వ్యాఖ్యలతో స్పష్టమైంది.
జూలై నుంచి ఆగస్ట్ లోపు దేశంలోని 25 నుంచి 30 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సిన్‌ను అందించాలని కేంద్రం భావిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.అయి తే.. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించే విషయంలో అలక్ష్యం పనికిరాదని మంత్రి చెప్పారు.