వ్యాక్సిన్ అభివృద్ధికి రూ 900 కోట్ల ఉద్దీపన ప్యాకేజీ

భారత ప్రభుత్వం మిషన్ కోవిడ్ సురక్ష- ఇండియన్ కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధి మిషన్ కోసం మూడవ ఉద్దీపన ప్యాకేజీని రూ.900 కోట్లతో ప్రకటించింది. ఇండియన్ కోవిడ్ -19 వ్యాక్సిన్ల పరిశోధన, అభివృద్ధి కోసం బయోటెక్నాలజీ విభాగానికి (డిబిటి) ఈ గ్రాంట్ అందించనున్నారు. 
 
చికిత్స విధానం అభివృద్ధి కోసం కోవిడ్-19 వ్యాక్సిన్ డెవలప్మెంట్ మిషన్ వేగవంతమైన ఉత్పత్తి అభివృద్ధి వైపు అందుబాటులో ఉన్న, నిధుల వనరులను అందిస్తుంది. ఇది సుమారుగా 5-6 వ్యాక్సిన్ కాండిడేట్ ల అభివృద్ధిని వేగవంతం చేస్తుంది. కోవిడ్ మరింత వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేయడానికి, ప్రజారోగ్య వ్యవస్థలలో ప్రవేశపెట్టడానికి రెగ్యులేటరీ అధికారుల పరిశీలన కోసం వీటిని లైసెన్సర్ కి మరింత దగ్గరకు తీసుకొచ్చి, ప్రయత్నం జరుగుతున్నది. 
 
ఫండ్ ముఖ్యమైన లక్ష్యాలు ప్రీ-క్లినికల్ & క్లినికల్ డెవలప్‌మెంట్‌ను వేగవంతం చేయడం; ప్రస్తుతం క్లినికల్ దశల్లో ఉన్న లేదా క్లినికల్ దశలో అభివృద్ధి చెందడానికి సిద్ధంగా ఉన్న కోవిడ్-19 వ్యాక్సిన్ కాండిడేట్ లైసెన్స్, క్లినికల్ ట్రయల్ సైట్‌లను ఏర్పాటు చేయడం. 
 
ప్రస్తుతం ఉన్న ఇమ్యునోఅస్సే ప్రయోగశాలలు, కేంద్ర ప్రయోగశాలలు, అధ్యయనాలకు అనువైన సౌకర్యాలు, ఉత్పత్తి సౌకర్యాలు, ఇతర పరీక్షా సౌకర్యాలను బలోపేతం చేయడం, కోవిడ్ -19 టీకా అభివృద్ధికి మద్దతు ఇవ్వడం. కోవిడ్ సురక్ష మిషన్ మొదటి దశకు 12 నెలలకు రూ .900 కోట్లు కేటాయించారు.
 
మొత్తం 10 వ్యాక్సిన్ కాండిడేట్లను బయోటెక్నాలజీ విభాగం ఇప్పటివరకుఅకాడెమియా ,ఇండస్ట్రీ రెండింటిలోనూ మద్దతు ఇచ్చింది. ప్రస్తుతం 5 వ్యాక్సిన్ అభ్యర్థులు రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్-వితో సహా మానవ పరీక్షల్లో ఉన్నాయి, త్వరలో మానవ పరీక్షలు చేపట్టడానికి మరో 3 వాక్సిన్లు ముందస్తు దశలలో సిద్ధంగా ఉన్నాయి. 
 
సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బయో టెక్నాలజీ విభాగం కార్యదర్శి, ఛైర్‌పర్సన్ బిరాక్  డాక్టర్ రేణుస్వరూప్ మాట్లాడుతూ, “మిషన్ కోవిడ్ సురక్ష మన దేశానికి స్వదేశీ, సరసమైన ధరలకు వ్యాక్సిన్ల అభివృద్ధి చేయడం మా లక్ష్యం. ఇది ఆత్మ నిర్భర్ భారత్ జాతీయ మిషన్‌ను సంపూర్ణం చేస్తుంది” అని తెలిపారు.