రూ 2.6 లక్షల కోట్ల పన్ను ఆదాయం తగ్గే అవకాశం 

కరోనా ప్రభావం కారణంగా 2020-21 ఏడాదికి గాను కేంద్ర ప్రభుత్వానికి రావాల్సిన పన్ను ఆదాయంలో 2.6 లక్షల కోట్లు తగ్గొచ్చని ఆర్ధిక మంత్రిత్వ శాఖలోని కీలక ఆధికారి చెప్పారు. ఈ ఏడాది బడ్జెట్‌ లో పన్ను ఆదాయ లక్ష్యం రూ. 24.23 లక్షల కోట్లుగా పేర్కొన్న సంగతి తెలిసిందే.
 
ఈ ఏడాదిలో తొలి ఆరు నెలల్లో వసూలైంది కేవలం 7.21 లక్షల కోట్లు మాత్రమే. ఇది గత ఏడాదితో పోలిస్తే 21.6 శాతం తక్కువగా ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా మొదటి ఆరు నెలలు స్తంభించిన ఆర్ధిక కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. 
 
మొదట అంచనా వేసినంత తక్కువగా పన్ను వసూళ్లు ఉండకపోవచ్చని నిపుణులు అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం అక్టోబర్‌ మాసంలో జిఎస్టీ వసూళ్లు 1.05 లక్షల కోట్లకు చేరాయి. 
 
గత ఏడాదితో పోల్చుకుంటే 10.2 శాతం ఎక్కువగా ఉంది. 
నవంబర్‌ మాసంలోనూ జిఎస్టీ వసూళ్లు 1.08 లక్షల కోట్లకు చేరుకునే అవకాశముందని అంచనా వేస్తున్నారు.