తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని బీజేపీ కర్ణాటక ఎంపీ, యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్విసూర్య స్పష్టం చేశారు. వారెన్ని చేసినా గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీ గెలుపును ఆపలేరని స్పష్టం చేశారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల గెలుపుపై ప్రజలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని తెలిపారు.
తేజస్వి సూర్య తనపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేయడంపై తీవ్రంగా స్పందించారు. నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీలోకి అనుమతి లేకుండా ప్రవేశించినందుకు ఆయనపై ఫిర్యాదు నమోదు అయ్యింది.
ఉస్మానియా యూనివర్సిటీ అధికారుల నుంచి అనుమతి తీసుకోకుండానే లోపలికి వచ్చాడని రిజిస్ట్రార్ ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో భాగంగా నగరానికి వచ్చిన తేజస్వీ సూర్య తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి, పోరాట యోధులకు నివాళులు అర్పించారు.
దీంతో పోలీసులు యూనివర్సిటీలోకి వెళ్లకుండా బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. బిజేపి కార్యకర్తలు, ఎంపి సూర్య కలిసి వాటిని తొలగించి లోపలికి వెళ్లాడు. ఓయూ ఆర్ట్ కాలేజీ వద్ద సమావేశం నిర్వహించారు. అనుమతి లేకుండా యూనివర్సిటీలోకి ప్రవేశించిన ఎంపిపై తేజస్వి సూర్యపై కేసు నమోదు చేశారు.

More Stories
తెలంగాణలో నవంబర్ 3 నుంచి కాలేజీలు బంద్
ఓ మతానికి ముడిపెట్టి గోమాతను అవమానించడం సరికాదు
అధికారం కోల్పోగానే బిఆర్ఎస్ కు విరాళాలలో గట్టి ఎదురుదెబ్బ