మతం మారిన వారికి బీసీ-ఏ సర్టిఫికెట్ల జారీ నిలిపివేయాలి

తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో క్రైస్తవం మతంలోకి మారిన అగ్నికుల క్షత్రియులకు బీసీ-ఏ సర్టిఫికెట్ల జారీని తక్షణం నిలిపి వేయాలని కోరుతూ జిల్లా హైందవ అగ్నికుల క్షత్రియ సంఘం ప్రతినిధులు మంగళవారం తహసీల్దార్ ఎం.సుజాతకు కోరారు. స్థానిక మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ ను కలిసిన సంఘం సభ్యులు ఈమేరకు వినతిపత్రం అందజేశారు.

అగ్నికుల క్షత్రియుల్లో 40 శాతం మంది మతం మారినప్పటికీ వారు రాజ్యాంగ విరుద్ధంగా బీసీ-ఏ సర్టిఫికెట్లు పొందుతున్నారన్నారని, క్రైస్తవ మతంలోకి మారి బీసీ-ఏ సర్టిఫికెట్లు పొందడం నేరమని అన్నారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో కేఎస్ రాజు సీ.హెచ్ అజయ్, ఎస్.వీ కృష్ణ, కె. కుమార్ స్వామి, ఎస్. సుబ్ర హ్మణ్యం, బీవీ రమణ తదితరులు ఉన్నారు

ఇటీవల ఏపీ ప్రభుత్వం నుండి కరోనా ఆర్ధిక సహాయం కింద రూ. 5 వేలు అందుకున్న 29,841 పాస్టర్లలో 65-70 శాతం మంది హిందూ ఎస్సీ, ఓబీసీ కులధ్రువీకరణ పత్రాలు కలిగివున్న విషయాన్ని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ అనే సంస్థ బయటపెట్టిన విషయం తెలిసిందే.

దానిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర సామాజిక న్యాయ సాధికార మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించిన నేపథ్యంలో, తమ సామాజికవర్గంలో ఉంటూ క్రైస్తవ మతానికి పాటిస్తున్నవారిని హైందవేతరులుగా గుర్తించాలని రాష్ట్రంలోని కుల సంఘాలు డిమాండ్ చేస్తుండటం మతమార్పిడి సమస్య తీవ్రతను తెలియజేస్తోంది.