
నియంత్రణ రేఖ దాటి భారత్‌లోకి ప్రవేశించాలనుకునే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను ఎవరూ కాపాడలేరని ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవాణే హెచ్చరించారు. ఒక్కసారి భారత్‌లోకి ప్రవేశించి తిరిగి వెనక్కి వెళ్లలేరని ఆయన స్పష్టం చేశారు.
జమ్ముకశ్మీర్ నగ్రోటా ప్రాంతంలో గురువారం నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చి ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేయడంపై ఆయన స్పందించారు. భారత్‌లోకి ప్రవేశించాలనుకునే పాక్ ఉగ్రవాదులందరికీ ఇదే గతిపడుతుందని స్పష్టం చేశారు.
యాపిల్ లోడు ట్రక్కులో నక్కిన ఉగ్రవాదుల మట్టుబెట్టేందుకు చేపట్టిన ఆపరేషన్‌లో భద్రతాదళాలు ఎనలేని ధైర్య సాహసాలు ప్రదర్శించాయని కొనియాడారు. ట్రక్కులో ఉగ్రవాదులున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.
తెల్లవారుజామున ట్రక్కు బాన్ టోల్‌ప్లాజా వద్దకు రాగానే భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య మూడు గంటల పాటు హోరాహోరీ కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ట్రక్కులో నక్కిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.
వీరి నుంచి పాక్‌స్థాన్‌లో తయారీ చేసిన మందులు, ఆయుధాలు, మందు గుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన నలుగురిని జైష్-ఎ-మహ్మద్ సంస్థ సభ్యులుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
More Stories
దేశ పౌరులు చట్టం తమదేనని భావించాలి
హత్యకు ముందు భారత్ పై దాడులకు నిజ్జర్ భారీ కుట్రలు
బీజేపీ మహిళా కార్యకర్తలకు ప్రధాని మోదీ పాదాభివందనం!