జగన్ పై కేసు విచారణ నుండి తప్పుకున్న న్యాయమూర్తి 

న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాయడమే కాకుండా దానిని మీడియాకు బహిర్గతం చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. జస్టిస్‌ యూయూ లలిత్‌కుమార్‌, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ రవీంద్ర భట్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వీటిని విచారించాల్సి ఉంది. 
 
 అయితే, చివరి నిమిషయంలో ఈ పిటిషన్ విచారణ నుంచి  జస్టిస్ లలిత్ కుమార్  తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆయన గతంలో జగన్ న్యాయవాదిగా కేసులలో  వాదనలు     వినిపించి ఉన్నందుకు కేసు నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. 
 
 ‘తనకు కొన్ని ఇబ్బందులున్నాయని,  గతంలో తాను… వాది, ప్రతివాదుల్లో ఒకరి తరఫున వాదనలు వినిపించానని, ఈ క్రమంలో తన ప్రమేయం లేకుండా తీర్పు రావాల్సి వుందని,  అలాంటి సమయంలో కేసు విచారణ తన ఆధ్వర్యంలో జరగడం సరికాదని’ భావించినట్లు జస్టిస్ లలిత్ పేర్కొన్నారు. 
 
అందుకే విచారణ నుంచి తప్పుకున్నట్లు ఆయన ప్రకటించారు.  ఈ పిటీషన్ ను  ప్రధాన న్యాయమూర్తి మరో ధర్మాసనానికి బదిలీ చేస్తారని జస్టిస్‌ లలిత్‌కుమార్‌ వెల్లడించారు.