ఎంపీకి మురళీధరరావు,  ఒడిసా, ఛత్తీ్‌సగఢ్ లకు పురందేశ్వరి 

బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా వివిధ రాష్ట్రాల్లో పార్టీ ఇన్‌చార్జులను ప్రకటించారు. ఈ మధ్య వరకు పార్టీ ప్రధాన  కార్యదర్శిగా ఉన్న మురళీధరరావును మధ్యప్రదేశ్, కొత్తగా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన డి పురందేశ్వరిని  ఒడిసా, ఛత్తీ్‌సగఢ్‌ లకు 
 పార్టీ ఇన్‌చార్జులుగా ప్రకటించారు. 
 
అట్లాగే ఉపాధ్యాయురాలుగా  నియమితులైన డీకే అరుణను కర్ణాటక, తెలంగాణకు చెందిన మరో మార్జి మంత్రి పి సుధాకరరెడ్డిని తమిళనాడుకు సహా ఇన్ ఛార్జ్ లుగా నియమించారు. 
 
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర మంత్రి వి మురళీధరన్‌ ఇన్‌చార్జిగా, సునీల్‌ దియోధర్‌ సహ ఇన్‌చార్జిగా  కొనసాగుతారు. తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జిగా పార్టీ జాతీయ కార్యదర్శి తరుణ్‌ చుగ్‌ను నియమించింది.  తెలంగాణతో పాటు జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ బాధ్యతలను కూడా ఆయన నిర్వహిస్తారు.పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ అండమాన్‌ ఇన్‌చార్జితో పాటు ఉత్తరప్రదేశ్‌లో సహ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారు.
 
తమిళనాడు, మహారాష్ట్ర, గోవా బాధ్యతలను ప్రధాన కార్యదర్శి రవి నిర్వహిస్తారు. కైలాస్‌ విజయ్‌ వర్గీయ యథా ప్రకారం పశ్చిమ బెంగాల్‌ బాధ్యతలు నిర్వహిస్తారు.  అట్లాగే భూపేంద్ర యాదవ్ బీహార్, గుజరాత్ ల ఇన్ ఛార్జ్ గా కొనసాగుతారు. పార్టీ ఉపాధ్యక్షుడు జయపండా అస్సాం, ఢిల్లీ లకు ఇన్ ఛార్జ్ గా నియమించారు. 
 
పార్టీ ప్రధానకార్యదర్శి శ్యంత్ కుమార్ గౌతమ్ ను పంజాబ్, చండీఘర్, ఉత్తర్ ఖండ్ లను, మాజీ కేంద్ర మంత్రి రాధా మోహన్ సింగ్ ఉత్తర్ ప్రదేశ్ లను పర్యవేక్షిస్తారు. సునీల్ ఓజా, సత్యకుమార్, సంజయ్ చౌరాసియా యుపి సహా ఇన్ ఛార్జ్ లుగా వ్యవహరిస్తారు. అరవింద్ మీనన్, అమిత్ అమలవీయలను పశ్చిమ బెంగాల్ సహా ఇన్ ఛార్జ్ లుగా నియమించారు. 

పార్టీ మోర్ఛాలకు భూపేందర్ యాదవ్ (కిసాన్ మోర్చా), గౌతమ్ (మహిళా మోర్చా), అరుణ్ సింగ్ (ఓబిసి మోర్చా), తరుణ్ ఛుగ్ (యువ మోర్చా), పురందేశ్వరి (మైనారిటీ మోర్చా), సిటీ రవి (ఎస్పీకి మోర్చా), సైకిల్ (ఎస్టీ మోర్చా) ఇన్ ఛార్జ్ లుగా వ్యవహరిస్తారు. 

పార్టీ ప్రధాన కార్యదర్శులు అరుణ్ సింగ్ రాజస్థాన్, కర్ణాటకలకు, దిలీప్ సైకియా ఝార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మణిపూర్ కు, మాజీ ఎంపీ పి రాధాకృష్ణన్ కేరళకు, ఎస్సి మోర్చా మాజీ  సొంకర్ త్రిపుర ఇన్ ఛార్జ్ లుగా వ్యవహరిస్తారు. 
 
మిగిలిన రాష్ట్రాల ఇన్ ఛార్జ్ లు:  సుకంటా మజుందార్ (సిక్కిం),  నలిన్ కోహ్లీ (నాగాలాండ్), ఎం చుబా ఏవో (మేఘాలయ), మహోన్లుమో (మిజోరాం), నిర్మల్ కుమార్ సూరన (పుదుచ్చేరి), ఎపి అబ్దుల్లాకుట్టి (లక్షద్వీప్), అవినాష్ రాయి ఖన్నా (హిమాచల్ ప్రదేశ్).