
భవిష్యత్‌లో ఫైటో ఫార్మాస్యూటికల్ పరిశోధన తెరపైకి రానుందని పద్మ భూషణ్, నీతి అయోగ్ సభ్యుడు విజయ్‌కుమార్ సరస్వత్ తెలిపారు. బాలానగర్ పారిశ్రామికవాడ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్)లో మంగళవారం నిర్వహించిన 14వ ఫౌండేషన్ డే వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటూ ఫార్మారంగానికి ఉజ్వల భవిష్యత్ ఉన్నదని చెప్పారు.
భారతదేశంలో ఫార్మాస్యూటికల్ ఇన్‌స్టిట్యూట్‌లు కీలకపాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు. కరోనా విజృంభణ సమయంలో బయోఫార్మా ముందుకు వచ్చి వ్యాక్సిన్ తయారు చేసేందుకు సంకల్పించినట్లు ప్రకటించిందని గుర్తుచేశారు.
డేటా నుంచి జ్ఞానం పొంది సాంకేతిక పరిజ్ఞాణంతో డిజిటల్ రంగంలో పురోగతి సాధించడం శుభ పరిణామం అని పేర్కొన్నారు. భారీ రసాయన పరిశ్రమలను కాలుష్యరహిత సాంకేతికతలతో పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని సూచించారు.
బిరాక్ చైర్‌పర్సన్, డీబీటీ కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ నైపర్ హైదరాబాద్ అనతి కాలంలోనే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్-2020లో భాగంగా ఫార్మసీ విభాగంలో ఐదో స్థానం దక్కించుకోవడం పట్ల హర్షం ప్రకటించారు. అధునాతన అధ్యయనాల, ఔషధ శాస్త్రాలను నేర్చుకోవడానికి అత్యుత్తమ కేంద్రం గా నిలవడం సంతోషకరని తెలిపారు
More Stories
మే రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు
లిక్కర్ స్కాంలో అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి
దేశ జీడీపీ 7.2 శాతం వృద్ధి