హైదరాబాద్ లోని ఐటి కంపెనీ ధనుష్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన సంవాద్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ తో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఎఐసిటిఇ) సాంకేతిక ఒప్పందం చేసుకొంది.
దీని ద్వారా పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన సమాచార వేదిక `సంవాద్’ ను ఆన్ లైన్ బోధనకు, సమావేశాలకు ఉపయోగించుకొనే అవకాశం కలుగుతుంది.
ఈ ఒప్పందంపై ఎఐసిటిఇ చైర్మన్ ప్రొఫెసర్ అనిల్ డి. సహస్రబుధే, సంవాద్ ఇన్ఫోటెక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డి ఎస్ ఎన్ మూర్తి సంతకాలు చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపిచ్చింది `ఆత్మ నిర్భర్ భారత్’ పిలుపుకు స్ఫూర్తి చెందిన కరోనా మహమ్మారి సమయంలో విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఆన్ లైన్ సమావేశాలు, విద్యాబోధనకు ఉపయోగపడే విధంగా `సంవాద్’ వేదికను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొనే రూపొందించినట్లు డి ఎస్ ఎన్ మూర్తి చెప్పారు.
దేశంలోని సాంకేతిక, ఇంజనీరింగ్ సంస్థలు, కళాశాలలు విద్యాబోధనలో, సమావేశాలకు పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన` సంవాద్’ సాంకేతిక వేదికను ఉపయోగించుకోవడానికి వీలు ఏర్పడుతుంది.
ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎఐసిటిఇ వైస్ చైర్మన్ డా. ఎం పి పూనియా, సలహాదారుడు ప్రొఫెసర్ దిలీప్ ఎన్ మ్లఖేడే, ఇ – గవర్నెన్స్ సెల్ డైరెక్టర్ డా ఎన్ హెచ్ సిద్ధలింగ స్వామి, సంవాద్ డైరెక్టర్ చంద్రమా గంగూలీ, వైస్ ప్రెసిడెంట్ రవి చావలి కూడా పాల్గొన్నారు.
More Stories
ఆర్బిఐ కొత్త గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా
కొత్తగా వంద ఎయిర్‌బస్ విమానాలకు ఆర్డర్
నోయిడా విమానాశ్రయం రన్‌వేపై తొలి విమానం