పట్టభద్రుల ఓటు నమోదు గడువు పెంచాలని ఎన్నికల కమిషన్‌కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు స్పందనగా.. న్యాయస్థానం ఆదేశాలను అమలు చేస్తామని, డిసెంబరు 1 నుంచి 31 వరకు ఓటు నమోదు అవకాశం కల్పిస్తామని ఈసీ, కోర్టుకు తెలిపింది.
ఈ మేరకు కొత్తగా మరో నోటిఫికేషన్ జారీచేస్తామని వెల్లడించింది. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో పట్టభద్రుల ఓటు నమోదు గడువును డిసెంబరు 7 వరకు గడువు పెంచాలంటూ న్యాయవాది రమేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది.
ఈ క్రమంలో పట్టభద్రుల ఓటు నమోదు గడువు శుక్రవారంతోనే నే ముగుస్తుందని ఈసీ కోర్టుకు తెలిపింది. చట్టప్రకారం నవంబరు 7లోపే ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉందని స్పష్టం చేసింది.
ఒకవేళ ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొంది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో మరోసారి అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించింది.

More Stories
నాగోల్లో యువమోర్చ మెగా రక్తదాన శిబిరం
రిమ్స్ ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ తో ముగ్గురు చిన్నారులు మృతి
‘ప్యారడైజ్’ టికెట్ ధరల పెంపు మెమోను వెనక్కి తీసుకోండి!