ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుందని పేర్కొంటూ మైలార్‌దేవ్‌పల్లి టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. రాష్ట్రంలో అమలవుతున్న చాలా పథకాల్లో కేంద్ర సాయం ఉందని.. కానీ, టీఆర్ఎస్ వాళ్లు మాత్రం సొంత డబ్బా కొట్టుకుంటున్నారని ఆయన విమర్శించారు.
ఆయన ఈ రోజు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘మైలార్‌దేవ్‌పల్లిలో టీఆర్ఎస్ పార్టీ అట్టడున ఉన్నప్పుడు నేను పార్టీలో చేరి కార్పొరేటర్‌గా టికెట్ దక్కించుకున్నాను. ఎమ్మెల్యే, అతని అనుచరులు ఎన్ని కుట్రలు చేసినా తట్టుకొని గెలిచాను’ అని పేర్కొన్నారు.
`ఆనాడు కేటీఆర్ బెదిరింపులకు భయపడి ఎమ్మెల్యే టీఆర్ఎస్‌లో చేరాడు. టీఆర్ఎస్ పార్టీ 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పెట్టిన మానిఫెస్టో పూర్తిగా విఫలమైంది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో నిరుపేదలు చాలామంది ఉన్నారు. వారిలో ఏ ఒక్కరికి డబుల్ బెడ్రూం ఇచ్చిన దాఖలాలు లేవు. టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంకు తొత్తుగా మారింది’ అని ధ్వజమెత్తారు.

More Stories
మావోయిస్టు అగ్రనేత గణపతి త్వరగా లొంగిపోవాలి
ఎమ్యెల్సీగా అజారుద్దీన్, కోదండరామ్.. గవర్నర్ ఆమోదం
`తెలంగాణ రాష్ట్ర సేన’ పార్టీ ఏర్పాటు ప్రకటించిన కవిత