కరోనా కట్టడిలో ట్రంప్  విఫలం… మోదీ విజయం 

కరోనా కట్టడిలో ట్రంప్  విఫలం… మోదీ విజయం 

కోవిడ్-19పై సకాలంలో చర్యలు తీసుకోవడం వల్ల ప్రధాని నరేంద్ర మోదీ 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశాన్ని కాపాడారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొనియాడారు. ఇదే పని చేయడంలో అమెరికా అధక్షుడు డొనాల్డ్ ట్రంప్ విఫలమయ్యారని పేర్కొన్నారు. 

‘కరోనా సమయంలో భారత్‌లో నరేంద్ర మోదీ చేయగలిగిన పనిని అమెరికాలో డొనాల్డ్‌ ట్రంప్‌ చేయలేకపోయారు. మోదీ ఎంతో ప్రణాళికా బద్ధంగా కోవిడ్‌ను ఎదురుర్కొన్నారు. ప్రజలను, దేశాలన్ని సురక్షితంగా కాపాడారు’ అని తెలిపారు.

అయితే,  అగ్రరాజ్యం అమెరికా కరోనా విపత్తును ఎదుర్కోవడంలో తీవ్రంగా విఫలమైందని చెబుతూ  ఆ దేశంలో పెద్ద ఎత్తున పౌరులు ప్రాణాలను కోల్పోయారని గుర్తు చేశారు. దాని ప్రభావం తాజా ఎన్నికలపై చూపిందని, అంతిమంగా ట్రంప్‌ వెనుకంజకు దారితీసిందని వివరించారు. 

మార్చిలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో 78,000 మరణాలను నిరోధించగలిగామని కేంద్రం చెబుతోంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్ లో పరిస్థితి మెరుగ్గానే ఉందని గణాంకాలను చూపిస్తోంది.