
రాజస్థాన్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో బాణసంచా వినియోగంపై విధించిన నిషేధాన్ని ఎత్తేయాలంటూ ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తమిళనాడు సీఎం ఎడప్పాడి పళని స్వామి విజ్ఞప్తి చేశారు. దీనివల్ల బాణసంచా తయారీకి హబ్‌గా పేరుగాంచిన తమిళనాడులో 8 లక్షల మంది కార్మికులపై ప్రభావం పడుతుందని పళనిస్వామి ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఆయన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌లకు లేఖలు రాశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కాలుష్యం పెరగకుండా బాణసంచాపై నిషేధం విధిస్తున్నట్టు ఈ రెండు రాష్ట్రాలు ప్రకటించాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకున్నారు.
కాగా దేశంలోని 90 శాతం బాణసంచా తమిళనాడులోనే తయారవుతుందనీ, దీనిపై ఎనిమిది లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనోపాధి పొందుతున్నారని సీఎం పళని స్వామి తెలిపారు.
ఆయా రాష్ట్రాల్లో బాణసంచాపై నిషేధం విధించడం వల్ల నేరుగా దాని ప్రభావం తమిళనాడు కార్మికులపైనా, అంతేమొత్తంలో వీటిని విక్రయిస్తున్న వారిపైనా పడుతుందని పేర్కొన్నారు. తమిళనాడు కేవలం పర్యావరణ హితమైన టపాసులను మాత్రమే తయారు చేస్తోందనీ హామీ ఇచ్చారు. వీటి వల్ల పర్యావరణ కాలుష్యం తలెత్తే ప్రశ్నే లేదని ఆయన భరోసా ఇచ్చారు.
More Stories
హత్యకు ముందు భారత్ పై దాడులకు నిజ్జర్ భారీ కుట్రలు
కాంగ్రెస్ ఎంపీపై అస్సాం సీఎం భార్య రూ.10 కోట్ల పరువునష్టం దావా
నేడు ఏపీ సిఐడి కస్టడీకి చంద్రబాబు నాయుడు