అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటా…. పోటీ 

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలలో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఇద్దరు అభ్యర్థులు నువ్వా – నేనా అన్నట్లు ఉండడంతో ఎవ్వరికీ వారు గెలుపై ధీమా వ్యక్తం చేసుకొంటున్నారు. మొత్తం మీద ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి జోబిడెన్ కంటే వెనుకబడి ఉన్నారు. అయితే ఇద్దరి మధ్య తేడా స్వల్పంగా ఉండడంతో ఆసక్తి నెలకొన్నది. 
 
అభ్యర్థి బిడెన్ కు 224 ఎలక్టోరల్  ఓట్లతో దూసుకపోతున్నాడు. ట్రంప్ కు 213 ఎలక్టోరల్  ఓట్లు వచ్చాయి. జార్జియా, నార్త్ కరోలినా, పెన్సలీవినియా, మిచిగాన్, విస్కోసిన్, నెవడా రాష్ట్రాలలో ముందంజలో ట్రంప్ ఉన్నాడు. 83 ఎలక్టోరల్ ఓట్లలో ఇంకా లెక్కింపు జరుగుతుంది. 83 స్థానాలలో ట్రంప్ ముందంజలో ఉండడంతో ట్రంప్ అధ్యక్షుడు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
ఎన్నికల ఫలితాలు తుది దశకు చేరుకున్న తరుణంలో ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ అక్రమాలకు పాల్పడ్డారంటూ రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. సుప్రీం కోర్ట్ కు వీడుతున్నట్లు తెలుపుతూ ఎన్నికల కౌంటింగ్ ను వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు. 
 
 అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో భారీ విజ‌యాన్ని న‌మోదు చేసిన‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్‌ను ట్విట్ట‌ర్ సంస్థ తొల‌గించింది.  భారీ విజ‌యం దిశ‌గా వెళ్తున్నామ‌ని, ఎన్నిక‌లను కైవ‌సం చేసుకోనున్న‌ట్లు ట్రంప్ చేసిన ట్వీట్‌ను ట్విట్ట‌ర్ త‌న అకౌంట్ నుంచి తొల‌గించింది.  ప్ర‌త్య‌ర్థులు ఎన్నిక‌ల‌ను దోచేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.   
 
అమెరికా అధ్య‌క్ష రేసు ఉత్కంఠంగా మారిన నేప‌థ్యంలో డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి జో బైడెన్ కాసేప‌టి క్రితంఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించే దిశ‌గా ట్రాక్‌లో ఉన్నామ‌ని ప్రకటించారు. 
 
అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాల్లో 538 ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి. 270 ఎలక్టోరల్ ఓట్లు సాధిస్తే వారే అధ్యక్ష పదవిలో ఉంటారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడి నిర్ణయించే రాష్ట్రాలు జార్జియా, నార్త్ కరోలినాపై ఆధారపడి ఉంది. రెండు రాష్ట్రాలలో ట్రంప్ కంటే ఒక శాతం ఓట్లతో బిడెన్ వెనకబడి ఉన్నారు.