
రాజ్యసభలో ఎన్డీయే బలం మొదటిసారిగా 100 మార్క్ దాటి, స్పష్టమైన మెజారిటీకి సోమవారం బిజెపి సభ్యులు 9 మంది ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో ఆ పార్టీ బలం సొంతంగా 92కు చేరుకొంది. ఎప్పుడు రాజసభలో అతిపెద్ద పార్టీగా ఉంటూ వస్తున్న కాంగ్రెస్ బలం ఇప్పుడు ఎన్నడూ లేనంత తక్కువగా 38కి పడిపోయింది.
ఉత్తరప్రదేశ్ నుంచి మొత్తం 10 మంది అభ్యర్థులు సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సహా 8 మంది బిజెపికి చెందిన వారు. ఉత్తరాఖండ్ నుంచి కూడా బీజేపీ సీనియర్ నేత నరేష్ బన్సాల్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ముగ్గురు సభ్యులు తిరిగి ఎన్నిక కాగా, ఆరుగురు కొత్తగా ఎన్నికయ్యారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన జెడి (యు) నుండి ఐదుగురు ఎన్నికయ్యారు. బిజెపికి మద్దతు ఇస్తున్న ఇతర చిన్న పార్టీల నుండి మరో ఏడుగురు ఎన్నికయ్యారు. ఆర్పీఐ-అథవాలే, అస్సాం గణ పరిషద్, మిజో నేషనల్ ఫ్రంట్, నేషనల్ ప్యూపిల్స్ పార్టీ, నాగా ప్యూపిల్స్ పార్టీ, పట్టాలి మక్కల్ కచ్చి, బోడోలాండ్ ప్యూపిల్స్ పార్టీ ల నుండి ఒకొక్కరు ఎన్నికయ్యారు.
వీరందరితో కలిపి 242 మంది సభ్యులున్న రాజ్యసభలో ఎన్డీయే బలం 104కు చేరుకోగా, మరో నలుగురు నామినెటే సభ్యుల మద్దతు బిజెపికి ఉంది. మెజారిటీ కావాలంటే 222 మంది సభ్యులు అవసరం కాగలదు. కీలక బిల్లుల విషయంలో అన్నాడీఎంకే (9), బిజెడి (9), వైసిపి (6) బిజెపికి మద్దతు ఇస్తూనే ఉన్నారు.
కాగా, ఉత్తర ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన వారణాసికి చెందిన న్యాయవాది ప్రకాశ్ బజాజ్ నామినేషన్‌ను అధికారులు సాంకేతిక కారణాలతో పక్కనపెట్టడంతో 10 స్థానాలకు ఎన్నికలు జరుపాల్సిన అవసరం లేకుండా పోయింది. దాంతో 10 స్థానాల్లో బీజేపీకి ఎనిమిది, సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీకి చెరొక్కటి లభించాయి.
యుపి నుండి ఎన్నికైన బీజేపీ అభ్యర్థులలో కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ పూరితోపాటు అరుణ్ సింగ్, హరిద్వార్ దుబే, బ్రిజ్ లాల్, నీరజ్ శేఖర్, గీతా శాక్య, సీమా ద్వివేది, బీఎల్ వర్మ ఉన్నారు. సమాజ్‌వాదీ పార్టీ నుంచి ప్రొఫెసర్ రామ్ గోపాల్ యాదవ్, బీఎస్పీ నుంచి రామ్‌జీ గౌతమ్ కూడా ఎగువ సభకు ఎన్నికయ్యారు.
బీఎస్పీకి చెందిన రాంజీ గౌతమ్, ఎస్పీ మద్దతుతో బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి ప్రకాష్ బజాజ్ మధ్య పదో సీటు కోసం హై డ్రామా జరిగింది. చివరకు ప్రకాశ్ బజాజ్ నామినేషన్‌ను సాంకేతిక పరిశీలనలో రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. దాంతో బీఎస్పి అభ్యర్థి రామ్‌జీ గౌతమ్.. తన పార్టీకి పది ఓట్లు మాత్రమే ఉన్నప్పటికీ విజయం సాధించారు.
More Stories
మణిపూర్ హింసాకాండపై దర్యాప్తు, డిజిపిపై వేటు
పార్లమెంట్ భవనం ప్రారంభం బహిష్కరించి దేశాన్ని అవమానించారు
మయన్మార్ నుండి వివిధ తెగల వలసలపై అమిత్ షా దృష్టి