పాస్‌పోర్టు సేవల్లో తెలుగు రాష్ట్రాలు మంచి పనితీరు కనబరిచాయని, ఈ రెండు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని కేంద్రం హోమ్ శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి అభినందించారు.
హైదరాబాద్ రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీసును రినవేషన్ చేసిన సందర్భంగా కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ తో కలిసి కిషన్ రెడ్డి వర్చ్యువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విదేశాంగ శాఖ కృషితో దేశవ్యాప్తంగా పాస్‌పోర్టు సేవల్లో సమూల, సానుకూల మార్పులు జరిగాయని కొనియాడారు. పాస్ పోర్టు జారీ ప్రక్రియలో పోలీసు ధ్రువీకరణ కీలకమైన అంశమని చెప్పారు.
దీంతో విదేశాంగ, హోం మంత్రిత్వ శాఖలు అన్ని రాష్ట్రాల పోలీసు విభాగాలకు సరికొత్త టెక్నాలజీని అందించి, ఫాస్ట్ ట్రాక్ ధ్రువీకరణ ప్రక్రియను అనుసరించేలా చర్యలు తీసుకున్నాయని తెలిపారు.
దేశంలో 2016 వరకు 90 పాస్‌పోర్టు కేంద్రాలు మాత్రమే ఉండగా, ఇప్పుడు దేశంలో 507 కేంద్రాలు ఉన్నాయని కిషన్రెడ్డి పేర్కొన్నారు. పోస్టాఫీసుల్లో కూడా పాస్ పోర్టు సేవా కేంద్రాలు విజయవంతంగా పనిచేస్తున్నాయని చెప్పారు.
More Stories
ట్యాంక్బండ్ వద్ద ఫ్లెక్సీలు, బారికేడ్లను తొలిగిన గణేశ్ ఉత్సవ సమితి
ముడి పామాయిల్ దిగుమతిపై పన్ను పెంపు
గల్ఫ్ కార్మికుల పిల్లలకు అడ్మిషన్లు, మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు