పాక్ నుంచి కాశ్మీర్, గిల్గిట్-బల్దిస్థాన్ తొలగించిన సౌదీ 

పాకిస్తాన్‌ను సౌదీ అరేబియా కోలుకోలేని దెబ్బ తీసింది. వచ్చే నెలలో జరగనున్న జీ 20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ముద్రించిన నోటు వెనక పాకిస్తాన్‌ మ్యాప్‌ నుంచి కశ్మీర్‌, గిల్గిట్‌-బాల్టిస్తాన్‌ లను తొలగించడం ద్వారా సౌదీ అరేబియా పాకిస్తాన్ కు షాక్ ఇచ్చింది. అయినా పాక్ మౌనం వహిస్తున్నది. దీపావళి నుండి భారత్ కు ఈ నోట్ ను సౌదీ ఇచ్చిన కానుకగా పరిశీలకులు భావిస్తున్నారు. 

జీ 20 శిఖరాగ్ర సమావేశం రియాద్‌ వేదికగా వచ్చే నెల 21, 22 తేదీల్లో జరుగున్నది. దీనికి సంబంధించిన ప్రత్యేక 20 రియాల్స్‌ నోటును సౌదీ అరేబియా ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. నోట్‌ వెనకాల జీ 20 దేశాల మ్యాపులను ముద్రించారు. అయితే, పాకిస్తాన్‌ మ్యాపులో కశ్మీర్‌తోపాటు గిల్గిట్‌-బాల్టిస్తాన్‌ ప్రాంతాలను తొలగించి ముద్రించారు.

ఈ ప్రాంతాలు పాకిస్తాన్‌లో భాగంగా చూపించలేదు. వాటిని స్వతంత్ర దేశాలుగా పేర్కొన్నారు. సౌదీ అరేబియా ప్రభుత్వం, ప్రిన్స్ సల్మాన్ అధ్యక్షత వహించనున్నారు. ఈ సందర్భంగా జీ 20 సమావేశం గుర్తుగా అక్టోబర్ 24 న సౌదీ ప్రభుత్వం 20 రియాల్స్ కరెన్సీ నోటును జారీ చేసింది.

దీనిపై ముందు భాగంలో సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఫొటోతోపాటు ఒక నినాదం ఉండగా, రెండవ వైపున ఉన్న ప్రపంచపటంలో జీ-20 దేశాలను వేర్వేరు రంగుల్లో చూపించారు. కశ్మీర్ కాకుండా గిల్గిట్, బాల్టిస్తాన్లను పాకిస్థాన్ లో భాగంగా వర్ణించలేదు.

సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌ దేశాలతో భారత్‌తో చాలా సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నది. ప్రిన్స్ సల్మాన్ తన విదేశాంగ విధానాన్ని మార్చుకుని ఇప్పుడు భారతదేశానికి చాలా ప్రాముఖ్యతనిస్తున్నారు. కశ్మీర్‌పై కూడా సౌదీ ప్రభుత్వం భారత్‌కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 

మిగతా అరబ్ దేశాలు కూడా అదే చేశాయి. పాకిస్తాన్ ఇప్పుడు చైనా, టర్కీలతో కొత్త సమూహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. దీనిపై అమెరికా, ఇజ్రాయెల్‌ సహా సౌదీ అరేబియా గమనిస్తున్నట్లు విదేశాంగ నిపుణులు చెప్తున్నారు.