కాంగ్రెస్ మొత్తం ఖాళీ అయిపోయిందనీ.. ఆ పార్టీలో ఇక ఎవరూ మిగలరని మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఎద్దేవా చేశారు.
‘‘కాంగ్రెస్‌ను వీడి బయటికి వచ్చిన వారంతా ‘అమ్ముడుపోయారంటూ’ అని ఆ పార్టీ నేతలు దిగ్విజయ్ సింగ్, కమల్‌నాథ్ ఆరోపించడం మొదలుపెట్టారు. మోతీలాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ తదితరులు కూడా కాంగ్రెస్‌ను విడిచిపెట్టారు” అని గుర్తు చేసారు.
“ఇందిరా జీ కూడా కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టారు. చివరికి దిగ్విజయ్ సింగ్ సోదరుడే కాంగ్రెస్‌కు గుడ్‌పై చెప్పారు. ఇంకా ఎవరైనా ఉంటారు అనుకోవడానికి ఆ పార్టలో మిగిలిందేంటి?..’’ అని చౌహాన్ ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కమల్‌నాథ్, ప్రతిపక్ష నేత కమల్‌నాథ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కమల్ నాధ్, చివరికి యూత్ లీడర్ కూడా కమల్‌నాథ్ అన్నట్టు మహారాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి తయారైందని ధ్వజమెత్తారు.
కాగా కమల్ నాథ్ ఇటీవల బీజేపీ నేత ఇమర్తీ దేవిపై ‘‘ఐటెం’’ అంటూ చేసిన వ్యాఖ్యలపైనా చౌహాన్ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలకు రాహుల్ క్షమాపణ చెప్పినా కమల్‌నాథ్ మాత్రం వెనక్కి రాలేదంటూ దుయ్యబట్టారు.
‘‘74 ఏళ్ల వయసులో ఓ మహిళా మంత్రిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సబబేనా? ఇది దురదృష్టకరమనీ.. క్షమాపణ చెబుతున్నాననీ రాహుల్ అన్నారు. కానీ కమల్‌నాథ్ మాత్రం క్షమాపణ చెప్పలేదు…’’ అని చౌహాన్ పేర్కొన్నారు.
More Stories
వేదాలు భౌతిక, ఆధ్యాత్మిక జ్ఞానపు నిధి
బెంగాల్ పోలీసుల నిర్లక్ష్యంతో కీలక ఆధారాలు నాశనం
మోదీ పుట్టిన రోజుకు బిజెపి కార్యకర్తలకు `ప్రజాస్వామ్య తోఫా’