ఆర్టికల్ 370 రద్దును ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ భారతీయుడా లేక పాకిస్తాన్ పౌరుడా అంటూ నిలదీశారు.
‘‘మేము ఆర్టికల్ 370ని రద్దు చేశాం. ఇప్పుడు దేశంలో ఒకే జెండా, ఒకే చట్టం, ఒకే రాజ్యాంగం ఉంది. కానీ శ్రీనగర్ ప్రజలకు అన్యాయం జరిగిందని రాహుల్ గాంధీ అంటున్నారు. ఇమ్రాన్ ఖాన్ కూడా రాహుల్ వాదనతోనే ఐక్యరాజ్య సమితికి వెళ్తున్నారు. మరి రాహుల్ భారతీయుడా లేక పాకిస్తాన్‌కి చెందినవాడా?’’ అని నడ్డా ప్రశ్నించారు.
‘‘ఆర్టికల్ 370 అనేది తాత్కాలిక చట్టం మాత్రమేనని నెహ్రూ తరచూ చెప్పారు. లాహోర్‌లో జరిగిన ఓ కార్యక్రమం వేదికగా శశిథరూర్ భారత దేశాన్ని ఖండిస్తూ పాకిస్తాన్‌ను పొగిడారు. రాహుల్ గాంధీ కూడా పాకిస్తాన్‌పై పొగడ్తలు కురిపించారు. ఏమిటిది? మోదీ దేశాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం దేశానికి వ్యతిరేకంగా ఆలోచిస్తోంది…’’ అని నడ్డా ధ్వజమెత్తారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజస్థాన్‌లోని పలు జిల్లా బీజేపీ కార్యాలయాలను ప్రారంభించిన సందర్భంగా నడ్డా మాట్లాడుతూ కేంద్ర కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ రంగ చట్టాలపైనా ప్రశంసలు కురిపించారు. రైతులు తాము పండించిన పంటలను తమకు నచ్చిన చోట అమ్ముకునే స్వేచ్ఛను ఈ చట్టాలు కల్పిస్తాయని బీజేపీ అధ్యక్షుడు భరోసా ఇచ్చారు.
More Stories
సైఫ్ అలీ ఖాన్పై దాడిలో అండర్వరల్డ్ హస్తం లేదు!
31 నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
గర్భిణీలకు రూ.21,000, మహిళలకు నెలకు రూ.2,500