జూన్ 2018లో పాకిస్థాన్‌ను ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్టులో చేర్చింది. అప్పటి నుంచి రెండేళ్లుగా ఆ జాబితా నుంచి పాక్ బయటపడలేకపోతోంది. మనీ లాండరింగ్, ఉగ్రవాదులకు ఆర్థిక సాయంపై ఉక్కుపాదం మోపాలని, 2019 నాటికి తామిచ్చిన యాక్షన్ ప్లాన్‌ను పూర్తిగా అమలు చేయాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ఎఫ్ఏటీఎఫ్ కోరింది.
ఈ మేరకు 27 అంశాలతో కూడిన కార్యాచరణ ప్రణాళికను సూచించింది. అయితే, వీటిలో 21 అంశాల్లో మాత్రమే చర్యలు తీసుకున్న పాక్.. ముఖ్యమైన ఆరు పాయింట్లను విస్మరించింది.
భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులైన మౌలానా మసూద్ అజర్, హఫీజ్ సయాద్‌లపై చర్యలు తీసుకోవడంలోనూ మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో ఆ దేశాన్ని మరోమారు గ్రే లిస్టుకే పరిమితం చేయనుంది.
కాగా, కరోనా మహమ్మారి కారణంగా గడువును పొడిగించిన ఎఫ్ఏటీఎఫ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికైనా పూర్తి యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయాలని కోరింది.
More Stories
సైఫ్ అలీ ఖాన్‌పై దాడిలో అండర్‌వరల్డ్ హస్తం లేదు!
ఇక విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ సమస్య ఉండదు
గాజాలో 19న మొదటి విడత బందీల విడుదల!