వచ్చే ఏడాది జూన్ నాటికి స్వదేశీ వ్యాక్సిన్

కరోనా వైరస్ వ్యాక్సిన్ రూపొందించేందుకు ప్రపంచవ్యాప్తంగా వైద్య శాస్త్రవేత్తలు పలు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో మనదేశానికి చెందిన భారత్ బయోటెక్ కంపెనీ ‘కోవ్యాక్సిన్’ రూపకల్పనలో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన మూడవ దశ ట్రయల్స్‌కు అనుమతి లభించింది.  
 
 ఈ వ్యాక్సిన్ 2020 జూన్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భారత్ బయోటెక్ సంస్థ తెలిపింది. హైదరాబాద్‌కు చెందిన ఈ కంపెనీ డీసీజీఐకి లేఖ రాస్తూ తమ టీకా మూడవ దశ ట్రయల్స్‌కు అనుమతి కోరింది. 
 
కంపెనీ రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం దేశంలోని 12 నుంచి 14 రాష్ట్రాల్లో సుమారు 20 వేలకు మించిన వాలంటీర్లపై ఈ వ్యాక్సిన్ ప్రయోగించనున్నారు. 
 
ఈ సందర్భంగా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి ప్రసాద్ మాట్లాడుతూ అన్ని అనుమతులు అనుకున్న సమయానికి లభించిన పక్షంలో 2020 ద్వితీయార్థం నాటికి వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటుందని తెలిపారు.