
భారత నౌకాదళంలో కొత్త అధ్యాయం మొదలైంద సముద్ర జలాలపై నిఘా వేసి భారత నేవీకి సేవలందించేందుకు తొలిసారిగా మహిళా పైలట్ల బృందం సిద్ధమైంది.
లెఫ్టినెంట్ దివ్య శర్మ (ఢిల్లీ), లెఫ్టినెంట్ శుభాంగి స్వరూప్ (యుపి), లెఫ్టినెంట్ శివాంగి (బీహార్)అనే ముగ్గురు పైలట్లు సదరన్ నేవల్ కమాండ్(ఎ్‌సఎన్‌సీ)లో శిక్షణ పూర్తి చేసుకున్నారని రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు.
‘‘27వ డోర్నియర్ విమాన శిక్షణ(డీఓఎ్‌ఫటీ) కోర్సులో ఈ ముగ్గురు యువతులు శిక్షణ పొందారు. కొచ్చిలోని ఐఎన్‌ఎ్‌స గరుడలో గురువారం నిర్వహించిన పాసింగ్ ఔట్ వేడుకలో తమ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. నేవీకి సంబంధించిన అన్ని అపరేషన్ మిషన్లలోనూ డోర్నియర్ విమానాన్ని నడిపేందుకు వీరికి పూర్తి సామర్థ్యం ఉంది’’ అని పేర్కొన్నారు.
దివ్య శర్మ స్వస్థలం న్యూఢిల్లీలోని మాలవీయనగర్ కాగా శుభాంగి స్వరూప్ ఉత్తర ప్రదేశ్‌లో తిల్‌హార్‌కు, శివాంగి బిహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన వారని తెలుస్తోంది. తొలుత వాయుసేన వీరికి పాక్షిక శిక్షణ ఇవ్వగా.. అనంతరం నేవీలోని డీఓఎ్‌ఫటీ కోర్సులో చేరి తమ శిక్షణను పూర్తి చేసుకున్నారని ప్రతినిధి వివరించారు.
More Stories
ఈ నెల 29న సూర్యగ్రహణం
అమెరికా చట్టాలకు భారతీయ విద్యార్థులు లోబడి ఉండాలి
భారత ప్రభుత్వాన్ని కోర్టులో ఎక్స్ సవాల్