లైంగిక వేధింపులకు గురవుతున్న మహిళా నక్సలైట్లు 

సమసమాజం కోసం, పేద ప్రజల కోసం సాయుధ పోరాటం జరుపుతున్నామని  ప్రచారం చేసుకొనే వామపక్ష తీవ్రవాదులైన నక్సలైట్లు లేదా మావోయిస్టు దళాల్లో మహిళలు తీవ్ర అణచివేతకు, లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు తెలుస్తున్నది. ఈ అంశాలకు ప్రధాన స్రవంతి మీడియా తగు ప్రాధాన్యత ఇవ్వక పోయినా పోలీసులకు లొంగిపోయిన పలువురు మహిళా నక్సలైట్లు చెప్పిన కధనాలు అందుకు స్పష్టమైన ఆధారాలు అందిస్తున్నాయి.

మహిళా సాధికారత, మహిళా హక్కులు, మహిళా కమిషన్, ఫెమినిజం గురించి నిత్యం మాట్లాడే మావోయిస్టు మేధావులు నక్సలైట్లచే మహిళలను నిరంతరం అణచివేతకు గురికావడం గురించి నోరు మెదపరే? ఎక్కువగా మావోయిస్టులు హత్యలు, దోపిడీలు, బాంబు ప్రేలుళ్ళు, ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యకలాపాలు, రైతులు, గిరిజనులు, గ్రామీణులకు, అభివృద్ధి కార్యక్రమాలకు వ్యతిరేకంగా చేస్తున్న హింసాయుత చర్యలే వెలుగులోకి వస్తుంటాయి.  మావోయిస్టు సంస్థలలో మహిళలను దారుణమైన అణచివేతకు గురవుతున్నారు.  మహిళా నక్సలైట్లను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడమే కాదు, వారు వివాహానికి సిద్ధంగా లేకుంటే, వారితో శారీరక సంబంధం పెట్టుకోవలసి వస్తుంది.

నక్సలైట్-మావోయిస్టుల సంస్థలో మహిళల స్థానం చాలా ఘోరంగా ఉంది, ఒక స్త్రీ నక్సల్ వివాహానికి లేదా శారీర సంబంధానికి సులభంగా సిద్ధంగా లేకుంటే, కొంతమంది మహిళలు ఆత్మహత్య చేసుకోవాలని వారు ఒత్తిడి చేస్తున్నారు.

మావోయిస్టు సంస్థలో, హింస, డబ్బుకు మాత్రమే ప్రాధాన్యత ఉంది, నియమం లేదా క్రమశిక్షణ లేదని పోలీసులకు లొంగిపోయిన సందర్భంగా  నక్సలైట్ దంపతులు సుధాకరన్, అతని భార్య నీలిమా తీవ్రమైన ఆరోపణలు చేశారు. మహిళల పట్ల అనుసరిస్తున్న ధోరణితో పాటు  సంస్థలో ఆరోగ్య సమస్యల కారణంగా, వారు ఆ మార్గాన్ని వదిలి ప్రధాన స్రవంతిలో చేరాలని నిర్ణయించుకున్నారని వారు చెప్పారు.

చాలా మంది మహిళా నక్సలైట్లు లొంగిపోయిన తరువాత కూడా వారిపై నక్సలైట్లు – మావోయిస్టులు లైంగిక వేధింపులను కొనసాగిస్తున్నారని వెల్లడించారు. ఈ సంవత్సరం మార్చి నెలలో, మావోయిస్టుల బారి నుండి బయటకు వచ్చిన కొందరు మహిళలు, నక్సలైట్లు జంతువుల్లాగే వ్యవహరిస్తారని కూడా చెప్పారు. 

తనతో దుష్ప్రవర్తన,  హింస సంఘటనలు సాధారణమయ్యాయని లొంగిపోయిన ఓ  మహిళ తెలిపింది. అలాగే, మావోయిస్టు సంస్థలో మహిళా నక్సలైట్‌లతో శారీరక వేధింపులు కూడా సాధారణం. 2014 లో, 3 మంది మహిళలతో సహా ఐదుగురు మావోయిస్టులు కొండగావ్, ఛత్తీస్‌ఘర్ ‌లోని నారాయణపూర్‌లో లొంగిపోయారు.

లొంగిపోయిన మావోయిస్టులలో, మావోయిస్టు సంస్థలో లైంగిక దోపిడీకి వేధింపులకు గురైన తర్వాత తాను లొంగిపోయానని ఒక మహిళా మావోయిస్ట్ బహిరంగంగా పేర్కొన్నారు.

ఛత్తీస్‌ఘర్ ‌లోని రాజ్‌నందగావ్ జిల్లాలోని మావోయిస్టు సంస్థకు చెందిన డల్లి రాజారా ఏరియా కమిటీ సభ్యుడు మావోయిస్టు దినేష్ అలియాస్ నవాల్ సింగ్ అలియాస్ బిల్లు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగు మావోయిస్టులు ఛత్తీస్‌ఘర్ ‌లోని గిరిజన మహిళలను లైంగికంగా దోపిడీ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. 

మావోయిస్టు సంస్థలలో మహిళలు అణచివేతకు  గురవుతున్నారని జార్ఖండ్ నుంచి అరెస్టు చేసిన మావోయిస్ట్ దీపక్ ఒరాన్ అరెస్టు తర్వాత చెప్పారు. మావోయిస్టు శిబిరాల్లోని మహిళల జీవితాలు చాలా కష్టమని 2010 లో మావోయిస్టు సంస్థకు లొంగిపోయిన మాజీ మావోయిస్టు శోభా మండి, ఉమా అలియాస్ శిఖా తమ పుస్తకంలో రాశారు.

వారు అక్కడ తీవ్రంగా దోపిడీకి గురవుతున్నారు. తన తోటి కమాండర్ తనపై 7 సంవత్సరాలపాటు  అనేకసార్లు అత్యాచారం చేసినట్లు ఆమె సరెండర్ ఫిమేల్ మావోయిస్ట్ పుస్తకంలో వెల్లడించింది. ఆమె 25-30 సాయుధ మావోయిస్టులకు కమాండర్‌గా ఉన్నప్పుడు కూడా ఇది జరిగింది.

మహిళా మావోయిస్టుల ప్రకారం, మావోయిస్టులు భార్యలను మార్పిడి చేసుకోవడంతో పాటు మహిళా మావోయిస్టులను కొట్టడం, అత్యాచారం చేయడం చాలా సాధారణం.

ఈ పుస్తకం ప్రకారం, సంస్థలోని ఎక్కువ మంది మహిళలపై దళం అధినేతయే ఎక్కువగా అత్యాచారాలకు  పాల్పడుతూ ఉంటాడు.  ఛత్తీస్‌ఘర్ ‌లోని మావోయిస్టులు  గిరిజన మహిళలను లైంగికంగా అణచివేతకు గురి చేసిన్నట్లు లొంగిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ప్రముఖ  నక్సలైట్ నాయకుడు చెప్పారు.

లైంగిక వేధింపులను నిరోధించినందుకు వారు అవమానానికి గురవుతారు. వివిధ రకాల హింసకు గురవుతారు. మావోయిస్టు-నక్సలైట్ నాయకులు మహిళా నక్సలైట్లను రకరకాల ప్రలోభాలకు గురిచేస్తుంటారు. 

తమ ప్రలోభాలకు లొంగని మహిళా నక్సలైట్ల పేర్లను  పోలీసు రికార్డులలో బలవంతంగా చేర్పిస్తుంటారు.  వాస్తవానికి నక్సలైట్ అగ్రనేతలు మహిళా నక్సలైట్లను “లైంగిక బానిసలు”గా చూస్తుంటారు. తమ బలం ఉపయోగించి మహిళా  కార్యకర్తలతో శారీరక సంబంధాలు ఏర్పర్చుకొంటారు. 

బలవంతంగా మహిళలతో శారీరక సంబంధాలు పెట్టుకోవడం కోసమే మావోయిస్టు సంస్థలో మహిళలను చేరమని ప్రోత్సహిస్తుంటారని లొంగిపోయిన కొందరు చెప్పారు. కొందరు మహిళా నక్సలైట్లను  మగ నక్సలైట్ కమాండర్లు వివాహం చేసుకొని శారీరకంగా హింసించడమే కాకుండా, తుపాకీ చూపి బెదిరించి శారీరకంగా వేధింపులకు గురిచేస్తున్నారని నివేదించారు.

ఆ విధంగా లైంగిక వేధింపులతో విసిగి పోయిన ఒక మహిళా నక్సలైట్ తప్పించుకొనే ప్రయత్నంలో కమాండర్ కు దొరికి పోయింది. అప్పుడు ఆమెను తనను తాను కాలుచుకోమని ఆదేశించి, ఆ విధంగా ఆమె కాల్చుకొనేటట్లు చేసాడు. 

మావోయిస్టు నాయకులు మహిళా  నక్సలైట్‌లను లైంగికంగా వేధించడమే కాకుండా, ఒక మహిళ నక్సలైట్‌ గర్భిణిగా మారితే బలవంతంగా గర్భస్రావం చేస్తారు. అందుకు ఆమె అంగీకారంతో సంబంధం ఉండదు. తాను మూడు నెలల గర్భిణీ అయినప్పుడు తనపై అనేకసార్లు అత్యాచారం జరిపిన నక్సలైట్ కమాండర్ ఎక్లాల్ లోహ్రా తనకు బలవంతంగా గర్భస్రావం చేయించాడని, రూ 15,000 ఇచ్చి ఒక ఇంట్లో ఉంచాడని ఓ మహిళా నక్సలైట్ వెల్లడించింది. 

నక్సలైట్ సంస్థలో ఎక్కువగా చిన్న వయస్సు గల బాలికలును చేర్చుకొంటుంటారు. వారెవ్వరూ స్వచ్ఛందంగా చేరారు. బలవంతంగా వారిని చేర్పిస్తుంటారు. చాలా మంది నక్సలైట్ నాయకులు మైనర్ బాలికలను లైంగికంగా వేధిస్తారు. కేవలం మహిళలుగా లైంగిక వేధింపులకు గురికావడమే కాకుండా , కులం, గిరిజన, గిరిజనేతరులు వంటి అంతరాలు సహితం వారిని వేధిపులకు గురిచేస్తుంటాయి.

(ది  నరేటివ్ వరల్డ్ వెబ్ సైట్ నుండి)