
బీజేపీ నేత, మధ్యప్రదేశ్ మంత్రి ఇమర్తి దేవిపై మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా గాంధీ కుటుంబం మౌనంగా ఉండడం ఏంటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ఇమర్తి దేవిపై కమల్‌నాథ్ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళా రాజకీయ వేత్తపై ఇలాంటి వ్యాఖ్యలు ఎంత వరకు సమర్ధనీయం? అయితే ఇక్కడ నాకో విషయం అర్థం కాలేదు. ఇంత జరుగుతున్నా గాంధీ కుటుంబం నుంచి ఎలాంటి ఉలుకూ పలుకూ లేదు’’ అని స్మృతి ఎద్దేవా చేశారు.
‘‘మద్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ఇలా వ్యాఖ్యానించడం ఇదే మొదటిసారి కాదు. ఓ మహిళా కార్యకర్తను ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యల్ని ఎవరు మర్చిపోతారు? ఇప్పుడు కమల్‌నాథ్ కూడా అలాగే వ్యవహరించారు” అని ఆమె పేర్కొన్నారు.
ఆమె నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎదిగిందని కొనియాడారు. గాంధీ కుంటుంబానికి మహిళలపై ఏమాత్రం గౌరవమున్నా కమల్‌నాథ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అయితే ఇది జరక్కపోవచ్చు. ఇలాంటి వాళ్లు కాంగ్రెస్ నుంచే పుట్టుకొస్తారని ధ్వజమెత్తారు.
More Stories
హిందూ సమాజ పునర్జీవనమే ఆర్ఎస్ఎస్ ఎజెండా
జస్టిస్ వర్మను దోషిగా చూపుతున్న నివేదిక!
మణిపూర్లో శాంతి పునరుద్ధరణలో పురోగతి