
కాశ్మీర్‌లోయలోనే అత్యంత సమస్మాతక్మమైన, తీవ్రవాద ప్రభావానికి గురైన పుల్వామా జిల్లాకు చెందిన ఒక విద్యార్థి నీట్‌లో రాణించడం దేశవ్యాప్తంగా అందరిదృష్టిని ఆకట్టుకుంటుంది. దేశవ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన నీట్ పరీక్షలో పుల్వామా జిల్లాకు చెందిన బిసిత్ బిలాల్ ఖాన్ 720కు 695మార్కులు సాధించి జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచాడు.
‘పుల్వామా నుంచి మూడు సంవత్సరాల క్రితం నా తల్లిదండ్రులు నన్ను శ్రీనగర్‌కు తరిలించారు. అదే నా విజయానికి దోహదపడింది’ అని మీడియాకు బిసిత్ తెలిపాడు. జమ్ముకాశ్మీర్‌లో ఇంటర్నెట్ నిషేధం, కనెక్టవిటీ నెమ్మదిగా ఉండటం గురించి బిసిత్ మాట్లాడుతూ కాశ్మీర్‌లో విద్యార్థులు తన లక్ష్యాలను సాధించడానికి నూతన మార్గాలు వెతుక్కోవాల్సిన అవసరం ఉందని చెప్పాడు.
‘మీ లక్ష్యం మీకు ముఖ్యమైతే, సాకులు చెప్పకుండా మార్గాలు వెతుక్కొండి. చాలా ఏళ్లుగా మాకు అనుకూలమైన పరిస్థితులు లేవు. మేము మరింత కష్టాలను ఎదుర్కొనే అవకాశముంది. మరిన్ని కష్టాలను వెతుక్కోవడానికి మేం సిద్ధంగా ఉండాలి’ అని తెలిపాడు.
బిసిత్ ఖాన్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ సలహాదారుడు ఫరూఖ్ ఖాన్ ప్రశంసించారు. నీట్‌లో 99.98 శాతం సాధించడం చారిత్రాత్మక విజయమని కొనియాడారు. ఎన్‌సి అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఇతర ప్రముఖులు కూడా బిసిత్‌ను అభినందించారు.
More Stories
మహాకుంభమేళా 2025కోసం డిజిటల్ కుంభ్ మ్యూజియం
పాకిస్థానీ చొరబాటుదారుడి కాల్చివేత
ఉగ్రవాదులకు నిధుల కేసులో జార్ఖండ్ లో సోదాలు